నకిలీ అడ్మిషన్ లెటర్లు, ఇతర ధ్రువపత్రాల కారణంగా కెనడాలో( Canada ) భారతీయ విద్యార్ధులు( Indian Students ) బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.అత్యున్నత స్థాయి ఒత్తిడితో కెనడా ప్రభుత్వం తాత్కాలికంగా ఈ బహిష్కరణను నిలిపివేసింది.
వందలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ బ్రిజేష్ మిశ్రాను( Brijesh Mishra ) కెనడా అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంపై పంజాబ్ ప్రతిపక్ష నేత పర్తాప్ సింగ్ బజ్వా( Partap Singh Bajwa ) రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీసుల సమర్ధత, ప్రభుత్వ పెద్దల వైఖరిపై ఆయన సందేహాలను లేవనెత్తారు.మిశ్రా భారత్ నుంచి తప్పించుకుని పారిపోవడం వెనుక కొందరు సీనియర్ పోలీసుల పాత్రను తోసిపుచ్చలేమని బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మిశ్రాను కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ అధికారులు. బ్రిటీస్ కొలంబియా ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారని, అంటే అతను కెనడా వెళ్లేందుకు ఇండియాలో ఎక్కడ విమానం ఎక్కాడని బజ్వా ప్రశ్నించారు.అతనికి ఎవరు సహాయం చేశారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.మిశ్రా అతని సహచరులు రాహుల్ భార్గవ్, గుర్నామ్ సింగ్‌లపై మార్చి 17, 27 తేదీల్లో పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని బజ్వా తెలిపారు.
మిశ్రాపై లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ అతను భారత్ నుంచి ఎలా పారిపోయాడో చెప్పాలని బజ్వా.పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్‌లను డిమాండ్ చేశారు.
కాగా.కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ శుక్రవారం మిశ్రాను అరెస్ట్ చేసింది.లైసెన్స్ లేకుండా ఇమ్మిగ్రేషన్ సేవలను అందించడం, అధికారులకు తప్పుదు సమాచారం ఇవ్వడం వంటి అభియోగాలను ఇతనిపై మోపింది.అలాగే కెనడా విద్యాసంస్థలలో ప్రవేశం కోసం భారతీయ విద్యార్ధులకు నకిలీ అడ్మిషన్ లెటర్స్ అందజేయడంలో అతని పాత్రకు సంబంధించి శుక్రవారం అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు.
బ్రిజేష్ మిశ్రా ప్రస్తుతం బ్రిటీష్ కొలంబియా నిర్బంధంలో వున్నాడు.అతనిని కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ నుంచి బ్రిటీష్ కొలంబియాలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించారు.ఈ నేపథ్యంలో మిశ్రాతో పాటు కొందరు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు తమను మోసం చేశారని , తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్ధులు కోరుతున్నారు.