డయాబెటిస్ పేషంట్స్ మీ ఇంట్లో వున్నారా? ఈ ఫుడ్‌కేర్ మొబైల్ అప్లికేషన్ ట్రై చేయండి!

గ్లూకోమీటర్లు( Glucometer ) తెలియని వారు ఇక్కడ దాదాపుగా వుండరు.ఇవి ఎన్నో ఏండ్ల నుంచి మనకు అందుబాటులో ఉన్నాయి.

 Do You Have Diabetes Patients In Your Home? Try This Foodcare Mobile Applicatio-TeluguStop.com

ఎందుకంటే ఇక్కడ ఇంటికొక డయాబిటిక్ పేషెంట్ ఉంటాడు కనుక.టెక్నాలజీ పెరుగుతుండడంతో ఇపుడు వాటినే కొత్త టెక్నాలజీతో అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు.

అలా వచ్చిందే వన్ టచ్ కంపెనీ తెచ్చిన ఈ స్మార్ట్ గ్లూకో మీటర్.వన్ టచ్ వెరియో ఫ్లెక్స్ గ్లూకోమీటర్ వాడడం అనేది చాలా తేలిక.

దీనిని ఎవరైనా వాడేయగలరు.ఇది కచ్చితమైన రిజల్ట్స్ ఇస్తుంది.

అంతేకాదు.గ్లూకోజ్ రీడింగ్‌లను వన్ టచ్ రివీల్ మొబైల్ యాప్‌లో ఖచ్చితత్వంతో చూపిస్తుంది.

దీంతో టెస్ట్ చేసుకోవాలంటే.ముందుగా టెస్ట్ స్ట్రిప్‌పై ఒక చుక్క రక్తం వేయాలి.

తర్వాత ఆ స్ట్రిప్ని మీటర్‌లోకి చొప్పించాలి.ఇంకేముంది కట్ చేస్తే, కేవలం 5 సెకన్లలోనే రిజల్ట్ వచ్చేస్తుంది.

Telugu Glucometer, Care, Tips, Ketone, Latest, Apps, Sugar-Telugu Health

అదేవిధంగా షుగర్ పేషెంట్ల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ గాడ్జెట్ వచ్చింది… దానిపేరు కనెక్టెడ్ సీజీఎం.ఇందులో సీజీఎంతోపాటు – ఇన్సులిన్ పంప్ కూడా ఇన్బిల్ట్గా వస్తుంది.గ్లూకోజ్ లెవల్స్ని బట్టి, అవసరమైన సర్దుబాట్లు ఇది చేసుకుంటుంది.ఇన్సులిన్ పంప్‌ని దాన్ని పెట్టుకున్న వ్యక్తి అవసరాలను తీర్చడానికి సరిపోయేలా ప్రోగ్రామ్ చేసారు ఇందులో.అదేవిధంగా ఇక్కడ ‘కీటోన్ మానిటర్( ketone monitor )’ గురించి మాట్లాడుకోవాలి.టైప్-2 షుగర్ ఉన్నవాళ్లు దీనిని విరివిగా వాడుతారు.వారికోసమే చాలా కంపెనీలు కీటోన్ బ్రీత్‌లైజర్ని మార్కెట్లోకి తీసుకొచ్చాయి.అయితే.దీనికంటే.రక్తం, మూత్రంతో చేసే టెస్ట్లు మరింత ఆక్యురేట్గా ఉంటాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

Telugu Glucometer, Care, Tips, Ketone, Latest, Apps, Sugar-Telugu Health

ఆ తరువాత చెప్పుకోదగ్గ ముఖ్యమైన యాప్ ‘ఫుడ్కేట్’ యాప్.డయాబెటిస్ ఉన్నవాళ్లందరికీ ఫుడ్‌కేట్ బెస్ట్ మొబైల్ అప్లికేషన్ అని నిపుణులు చెబుతున్నారు.ఈ అప్లికేషన్లో ఫుడ్లోని పోషక విలువల గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది.దాంతో ఏ ఫుడ్ బెస్ట్ అనేది పేషేంట్స్ తేలికగా తెలుసుకోవచ్చు.ఈ యాప్లో ఉన్నట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ని పూర్తిగా మార్చుకోగలిగితే.షుగర్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చని భోగట్టా.

ఈ యాప్ ద్వారా ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది షుగర్ వ్యాధిగ్రస్తులకు స్పష్టంగా తెలుస్తుంది.ఏ ఫుడ్లో ఎంత షుగర్ ఉందో కూడా ఈ యాప్లో తెలుసుకోవచ్చు.

ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ యాప్అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube