తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ :జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు

తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్( Jayashankar ) సార్ అని ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బిఆర్ ఎస్ పార్టీ జెడ్ పి టి సి కార్యాలయంలో జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు( BRS Party Activists ) పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ ‌సందర్బంగా జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని తెలంగాణా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని నిజం చేసిచూపించారని ప్రశంసించారు.జయశంకర్ సార్ తెలంగాణే ఊపిరిగా శ్వాస ఉన్నంత వరకు జీవించారిన చెప్పారు.

 Tribute To Professor Jayashankar Sir On His Death Anniversary,professor Jayashan-TeluguStop.com

జీవిత చరమాంకం వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని ఆయ‌న సేవ‌ల‌ను స్మరించుకున్నారు.
అనంతరం బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని కొనియాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించి భూపాలపల్లి జిల్లా కు జయశంకర్ సార్ పేరిటా నామకరణం చేశారని యూనివర్సిటీలకు జయశంకర్ సార్ పేర్లు పెట్టారని ఆయన గుర్తు చేస్తూ సార్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, డైరెక్టర్ జంగిడి సత్తయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యానాయక్, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు గో‌షిక దేవదాసు, తిండికి దేవరాజు, జవ్వాజీ రామస్వామి, అజ్జు , జాఫర్, మెండె శ్రీనివాస్ యాదవ్, గంట వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube