ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా.. ప్రపంచంలో టాప్-10 కార్లు ఇవే..!

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది.పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా కొందరు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మరికొందరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 Want To Buy An Electric Car These Are The Top 10 Cars In The World , Lucid Motor-TeluguStop.com

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు సరికొత్త టెక్నాలజీలతో రకరకాల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నారు.అయితే కొందరికి ఏ ఎలక్ట్రిక్ కారు కొనాలో తెలియక కాస్త సతమతమవుతున్నారు.

అటువంటి వారి కోసం ప్రపంచంలో ఉండే టాప్-10 ఎలక్ట్రిక్ కార్లు ఏవో.వాటి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఎయిర్: ఈ ఎలక్ట్రిక్ కారును లూసిడ్ మోటార్స్ కంపెనీ ( Lucid Motors Company )తయారు చేసింది.ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించగలిగే కారు గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 883 కిలోమీటర్ల దూరం వెళుతుంది.

జీఎంసీ:( GMC ) ఈ ఎలక్ట్రిక్ కారును జిఎంసి కంపెనీ( GMC Company ) తయారు చేసింది.ఈ కారును ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 570 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే కేవలం 3 సెకండ్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని దూసుకెళ్తుంది.

ఐయోనిక్యూ 6:( Ionic 6 ) ఈ ఎలక్ట్రిక్ కారు కూడా కేవలం ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే కేవలం 15 నిమిషాలలో బ్యాటరీ ఫుల్ అవుతుంది.

రివియన్ ఆర్1టీ:( Rivian R1T ) ఈ కారు కూడా కేవలం ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 640 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

బీఎండబ్ల్యూ ఐ ఎక్స్: ( BMW IX )ఈ కారు కూడా కేవలం ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది.

ఈక్యూఎస్:( EQS ) ఈ కారును మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తయారు చేసింది.ఈ కారు కేవలం 31 నిమిషాలలో 80% ఛార్జ్ అవుతుంది.

ఒక్కసారి చార్జింగ్ తో ఏకంగా 690 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

టెస్లా మోడల్ 3:( Tesla Model 3 ) ఈ కారు ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 540 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.3.1 సెకండ్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని ముందుకెళ్తుంది.

టెస్లా మోడల్ వై:( Tesla Model Y ) ఈ కారు ఒకసారి చార్జింగ్ పెడితే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం వెళ్తుంది.ఈ కారు 3.5 సెకండ్లు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

టెస్లా మోడల్ ఎస్:( Tesla Model S ) ఈ కారు ఒకసారి చార్జింగ్ పెడితే ఏకంగా 650 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

టెస్లా మోడల్ ఎక్స్:( Tesla Model X ) ఈ కారు ఒకసారి చార్జింగ్ తో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.ఈ కారు కూడా 2.5 సెకండ్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని ముందుకు దూసుకు వెళుతుంది.

Top Best Electric Cars Best Electric vehicles in the world

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube