చరణ్ ఉపాసన కూతురి గురించి అలాంటి కామెంట్లా.. జూనియర్ ఎన్టీఆర్ కోడలు అంటూ?

జూన్ నెల 20వ తేదీ మెగా ఫ్యాన్స్( Mega fans ) కు ప్రత్యేకమైన తేదీ అనే సంగతి తెలిసిందే.మెగా కుటుంబంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది.

 Comments About Charan Upasana Daughter Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

అపోలో డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ చరణ్ ఉపాసనల కూతురు చాలా అందంగా ఉందని చెబుతున్నారు.ఉపాసన, ఉపాసన కూతురు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

త్వరలోనే ఉపాసన( upasana ) డిశ్చార్జ్ ఉంటుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

మనవరాలిని చూసి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఎమోషనల్ అయ్యారు.ఈ ఆడబిడ్డ పుట్టుక అపురూపం అని చిరంజీవి అన్నారు.చరణ్ ఉపాసన 11 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనివ్వడం సంతోషాన్ని కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్న సంగతి తెలిసిందే.మెగా ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త అతిథి మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలను పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

భవిష్యత్తులో చరణ్ ఉపాసనలకు బాబు కూడా పుట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చరణ్ ఉపాసన తల్లీదండ్రులు కావడంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఎన్టీఆర్ పోస్ట్ కింద ఎన్టీఆర్ చిన్న కొడుకుకు చరణ్ కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.ఆర్.ఆర్.ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ కలిసి భారీ విజయాన్ని ఖాతాలో వేస్తున్నారు.ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే మాత్రం చరణ్, తారక్ కాంబోను మరోసారి స్క్రీన్ పై చూసే ఛాన్స్ ఉంటుంది.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమాలు ఒకే సమయానికి విడుదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చరణ్ ఉపాసనలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

Comments About Charan Upasana Daughter Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube