ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా.. ప్రపంచంలో టాప్-10 కార్లు ఇవే..!

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది.పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా కొందరు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మరికొందరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు సరికొత్త టెక్నాలజీలతో రకరకాల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నారు.

అయితే కొందరికి ఏ ఎలక్ట్రిక్ కారు కొనాలో తెలియక కాస్త సతమతమవుతున్నారు.అటువంటి వారి కోసం ప్రపంచంలో ఉండే టాప్-10 ఎలక్ట్రిక్ కార్లు ఏవో.

వాటి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.ఎయిర్: ఈ ఎలక్ట్రిక్ కారును లూసిడ్ మోటార్స్ కంపెనీ ( Lucid Motors Company )తయారు చేసింది.

ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించగలిగే కారు గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ కారును ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 883 కిలోమీటర్ల దూరం వెళుతుంది.

జీఎంసీ:( GMC ) ఈ ఎలక్ట్రిక్ కారును జిఎంసి కంపెనీ( GMC Company ) తయారు చేసింది.

ఈ కారును ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 570 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే కేవలం 3 సెకండ్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని దూసుకెళ్తుంది.

ఐయోనిక్యూ 6:( Ionic 6 ) ఈ ఎలక్ట్రిక్ కారు కూడా కేవలం ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే కేవలం 15 నిమిషాలలో బ్యాటరీ ఫుల్ అవుతుంది.

రివియన్ ఆర్1టీ:( Rivian R1T ) ఈ కారు కూడా కేవలం ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 640 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

"""/" / బీఎండబ్ల్యూ ఐ ఎక్స్: ( BMW IX )ఈ కారు కూడా కేవలం ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతుంది.

ఈక్యూఎస్:( EQS ) ఈ కారును మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తయారు చేసింది.

ఈ కారు కేవలం 31 నిమిషాలలో 80% ఛార్జ్ అవుతుంది.ఒక్కసారి చార్జింగ్ తో ఏకంగా 690 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

"""/" / టెస్లా మోడల్ 3:( Tesla Model 3 ) ఈ కారు ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 540 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

3.1 సెకండ్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని ముందుకెళ్తుంది.

టెస్లా మోడల్ వై:( Tesla Model Y ) ఈ కారు ఒకసారి చార్జింగ్ పెడితే ఏకంగా 500 కిలోమీటర్ల దూరం వెళ్తుంది.

ఈ కారు 3.5 సెకండ్లు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

"""/" / టెస్లా మోడల్ ఎస్:( Tesla Model S ) ఈ కారు ఒకసారి చార్జింగ్ పెడితే ఏకంగా 650 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

టెస్లా మోడల్ ఎక్స్:( Tesla Model X ) ఈ కారు ఒకసారి చార్జింగ్ తో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఈ కారు కూడా 2.5 సెకండ్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని ముందుకు దూసుకు వెళుతుంది.

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ మీద క్లారిటీ వచ్చిందా..?