చంద్రబాబు పేదల వ్యతిరేకి.. సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు పేదల వ్యతిరేకని సీఎం జగన్ అన్నారు.ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు.

 Chandrababu Is Against The Poor.. Cm Jagan-TeluguStop.com

చంద్రబాబు చేయని పనిని చేసినట్లుగా ప్రచారం చేసుకుంటారని తెలిపారు.

కోర్టులకు వెళ్లి పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారని సీఎం జగన్ మండిపడ్డారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు.పేదలకు రూ.2.16 లక్షల కోట్లు నేరుగా అందించామని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఇప్పుడు కుప్పం గుర్తుకు వచ్చిందన్న సీఎం జగన్ కుప్పంలో ఇంకో ఛాన్స్ ఇవ్వండని చంద్రబాబు అడుగుతున్నారని చెప్పారు.ఇంకో ఛాన్స్ ఇవ్వండి.ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి.ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తా అంటాడని ఎద్దేవా చేశారు.

ఎన్నికలు వస్తున్నాయనే మోసం చేయడానికి బయలుదేరారన్నారు.చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క వర్గానికి అయినా మంచి చేశారా అని ప్రశ్నించారు.

ప్రజలకు మంచి చేసిన చరిత్రే చంద్రబాబుకు లేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube