చంద్రబాబు పేదల వ్యతిరేకి.. సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు పేదల వ్యతిరేకని సీఎం జగన్ అన్నారు.ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు.

చంద్రబాబు చేయని పనిని చేసినట్లుగా ప్రచారం చేసుకుంటారని తెలిపారు.కోర్టులకు వెళ్లి పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారని సీఎం జగన్ మండిపడ్డారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు.

పేదలకు రూ.2.

16 లక్షల కోట్లు నేరుగా అందించామని పేర్కొన్నారు.చంద్రబాబుకు ఇప్పుడు కుప్పం గుర్తుకు వచ్చిందన్న సీఎం జగన్ కుప్పంలో ఇంకో ఛాన్స్ ఇవ్వండని చంద్రబాబు అడుగుతున్నారని చెప్పారు.

ఇంకో ఛాన్స్ ఇవ్వండి.ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి.

ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తా అంటాడని ఎద్దేవా చేశారు.ఎన్నికలు వస్తున్నాయనే మోసం చేయడానికి బయలుదేరారన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క వర్గానికి అయినా మంచి చేశారా అని ప్రశ్నించారు.

ప్రజలకు మంచి చేసిన చరిత్రే చంద్రబాబుకు లేదని తెలిపారు.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!