25 మంది కన్ఫర్మ్.. బీజేపీ మళ్ళీ పాత మాటే !

తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోందని, బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కమలనాథులు ఎప్పుడు చెబుతున్నా మాటే.ఇక రాబోయే రోజుల్లో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా పదే పదే చెబుతూ ఉంటారు.

 Has Bjp Started A Mind Game Again, Bjp , Bandi Sanjay , Ts Politics , Brs , Kcr-TeluguStop.com

చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెల రాజేంద్ర బాధ్యతలు చేపట్టినది మొదలుకొని తరచూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు తెలంగాణ బీజేపీ నేతలు.అయితే ఇంతవరకు పార్టీలో పెద్దగా ఎలాంటి చేరికలు జరగలేదు.

బి‌ఆర్‌ఎస్( BRS party ) నుంచి చాలమంది ఎమ్మెలెలు తమతో టచ్ లో ఉంటున్నారని వారంతా ఏ క్షణంలోనైనా బీజేపీలో చేరతారని చెబుతున్నప్పటికి.వారు ఎవరనేది ఇటు బీజేపీ నేతలు చెప్పడం లేదు.

అటు చేరే నేతలు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Telangana-Politics

దీంతో బీజేపీ చెప్పేవన్ని ఒట్టి మాటలే అనే భావన అందరిలోనూ కలుగుతోంది.ఇక అన్నీ ప్రగల్భాలు పలికిన ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో చేరికల కమిటీ చైర్మెన్ పదవిపై అటు ఈటెల కూడా అసహనంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ఇదిలా ఉంచితే తాజాగా మరోసారి చేరికల విషయంలో బీజేపీ నేతలు మళ్ళీ అగ్గి రాజేస్తున్నారు.

కుత్బుల్లాపూర్ లో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్( Bandi Sanjay Kumar ) మాట్లాడుతూ బి‌ఆర్‌ఎస్ కు సంబంధించిన 25 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, బీజేపీలో చేరేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారని ఒక్కసారిగా బాంబ్ పేల్చారు.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Telangana-Politics

అయితే ఇలాంటి వ్యాఖ్యలు తరచూ చెప్పేవే అయినప్పటికి.తేలికగా తీసుకునే అవకాశం లేదు.ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం కాబట్టి.

బండి సంజయ్ మాటలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే అటు బి‌ఆర్‌ఎస్ మాత్రం తమ పార్టీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే బయటకు పోయే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది.

ఇంకా బీజేపీ( BJP ) నుంచే కొంతమంది నేతలు బి‌ఆర్‌ఎస్ లోకి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చేరికల విషయంలో ప్రధాన పార్టీలు పకడ్బందీ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నాయనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube