ఐపీఎల్ ( IPL )అంటే యువ ఆటగాళ్లు( Young Players ) తమ సత్తా ఏంటో నిరూపించుకునే ఓ మంచి వేదిక.ఐపీఎల్ లో రాణిస్తే భారత జట్టులో( Team India ) చోటు దక్కే అవకాశాలు చాలా ఎక్కువ.
ఉదాహరణకు కనుమరుగైన అజింక్య రహనే ఐపిఎల్ లో సత్తా చాటి తిరిగి డబ్ల్యూటీసి ఫైనల్( WTC Final ) కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే జూలై- ఆగస్టు లో భారత జట్టు వెస్టిండీస్ టూర్( West indies tour ) వెళ్లనుంది.
టీ 20, వన్డే సిరీస్ భారత్- వెస్టిండీస్( IND vs WI ) మధ్య జరగనుంది.ఈ వెస్టిండీస్ టూర్ లో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి, ఐపీఎల్ లో సత్తా చాటిన జూనియర్లకు బీసీసీఐ చాన్స్ ఇచ్చింది.
భారత జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లకు విశ్రాంతి ఇచ్చారు.వెస్టిండీస్ టూర్ కు వెళ్లే భారత జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా బాధ్యతలు వ్యవహరించనున్నాడు.ఇక సూర్య కుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఐపీఎల్ లో సత్తా చాటిన రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేన్ శర్మ లకు వెస్టిండీస్ టూర్ కు వెళుతున్న భారత జట్టులో చోటు దక్కింది.
ఈ ముగ్గురితో పాటు ఐపీఎల్ లో అదరగొట్టిన మోహిత్ శర్మకు కూడా భారత జట్టులోకి రీ ఎంట్రీ అవకాశం దక్కనున్నట్లు సమాచారం.అంతేకాదు ఐపీఎల్ లో రాణించిన శివమ్ మావి, రాహుల్ త్రిపాఠి, తుషార్ దేశ్ పాండే పేర్లను కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారని సమాచారం.
2024 లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఈ యువ ఆటగాళ్లకు అధికంగా అవకాశాలు ఇచ్చే పనిలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి టీ 20, వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ కు వెళ్తున్న భారత జట్టులో ఈ ముగ్గురు యువకులకు అవకాశం దక్కడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.