ఆ హీరోయిన్లు ఫ్రీగా నటిస్తారు.. ఫేవర్ కూడా చేస్తారు.. కంగనా సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్( Kangana ) గురించి మనందరికీ తెలిసిందే.ఏ విషయాన్ని అయినా కూడా కుండలు బద్దలు కొట్టినట్టుగా ముఖం మీద చెప్పేస్తూ ఉంటుంది.

 Kangana Claims Female Actors Do Films For Free Details, Kangana, Bollywood, Fema-TeluguStop.com

దీంతో తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో ( Controversy )వార్తలు నిలుస్తూ ఉంటుంది కంగనా రనౌత్.మరొకవైపు సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఇది ఇలా ఉంటే తరచూ ఏదోక కాంట్రవర్సీతో వార్తలు కంగనా తాజాగా కూడా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

Telugu Bollywood, Female Actors, Kangana, Kangana Latest, Kanganafemale-Movie

తాజాగా ఒక ఇంటర్వ్యూలో( Interview ) పాల్గొన్న ఈమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.చాలా మంది A-జాబితా నటీమణులు ఉచితంగా పని చేస్తారనిఇతర మార్గాల్లో దర్శకనిర్మాతలకు ఫేవర్ చేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.గొప్ప మేకర్స్ తో అందివచ్చిన పాత్రను దక్కించుకోకపోతే తమకు నష్టం జరుగుతుందని,దీంతో అన్ని విధాలా కమిటవుతారని పారితోషికం లేకుండా ఉచితంగా పని చేస్తారని కూడా కంగన తెలిపింది.బాలీవుడ్ లో వేతన వ్యత్సాసంపైనా కంగన తీవ్రంగా విరుచుకుపడింది.

మగ నటులతో సమానంగా రెమ్యునరేషన్ ( Remuneration )పొందుతున్న ఏకైక నటి తానేనని తెలిపింది కంగనా.

Telugu Bollywood, Female Actors, Kangana, Kangana Latest, Kanganafemale-Movie

నేటికీ చాలా మంది నటీమణులు ఉచితంగా పనిచేస్తున్నారని, తాను అలా చేయడం లేదని కథానాయకులకు ధీటుగా పారితోషికం అందుకుంటున్న ఏకైక నటిని తాను మాత్రమేనని కంగనా వెల్లడించింది.అంతేకాకుండా పితృస్వామ్య నిబంధనలకు అనుగుణంగా గతంలో స్త్రీల ధోరణి ఉండేదని, కానీ సమాన వేతనం కోసం వాదించడంలో మార్గదర్శకురాలిగా మారాను అంటూ తనను తాను ప్రశంసించుకుంది కంగనా రనౌత్.కొన్ని పాత్రల కోసం మేకర్స్ తో చర్చించేప్పుడు తన సమకాలీన నటీమణులు ఉచితంగా పని చేయడానికి ముందుకొచ్చారని కంగనా వెల్లడించింది.

చాలా మంది A-జాబితా నటీమణులు పారితోషికం లేకుండా సినిమాలు చేస్తారని.ప్రభావవంతమైన వ్యక్తులతో పాత్రలను కోల్పోతారనే భయంతో ఇతర మార్గాలను ఆశ్రయిస్తారని కంగన బలంగా నొక్కి చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube