అల్లు శిరీష్ మళ్లీ అదే తప్పుడు నిర్ణయం.. మెగా ఫ్యాన్స్ సీరియస్‌

అల్లు అర్జున్‌( Allu Arjun ) వరుస సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్‌ గా దూసుకు పోతూ ఉండగా మరో వైపు అల్లు శిరీష్ మాత్రం అస్సలు సక్సెస్ అవ్వలేక పోతున్నాడు.కెరీర్‌ ఆరంభం నుండి కూడా శిరీష్( Allu Sirish ) సినిమాల ఎంపిక విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది.

 Allu Sirish New Film Started ,allu Sirish , New Film, Tollywood ,buddy, Pushpa-TeluguStop.com

తాజాగా మరోసారి ఆయన సినిమాల ఎంపిక విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా బడ్డీ అనే సినిమా( Buddy )ను కమిట్‌ అయ్యాడు.

గతంలో తమిళం లో వచ్చిన వచ్చిన టెడ్డీ సినిమాకు ఇది రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది.

అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది కూడా తెలియడం లేదు.భారీ ఎత్తున అంచనాలు పెంచేందుకు గాను ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది.కానీ ఆ వీడియో వల్ల శిరీష్ సినిమా పై జనాల్లో ఆసక్తి కలగలేదు.

పైగా మళ్లీ అదే తప్పును శిరీష్ చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేస్తున్న శిరీష్ ఫెయిల్యూర్స్ ను చవిచూస్తున్నాడు.ఆ విషయంలో ఎందుకు తన పద్దతి మార్చుకోడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 సినిమా లో అయినా అల్లు శిరీష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఇతర మెగా హీరోల సినిమాల్లో నటించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకని ఆ తర్వాత శిరీష్ హీరోగా ప్రయత్నాలు చేయడం మంచి పద్దతి మరియు మంచి నిర్ణయం అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శిరీష్ కెరీర్ లో మాత్రం సోలో హీరోగా సెటిల్ అవ్వాలని పట్టుదలతో ఉన్నాడు.

ఆయన పట్టుదలను కొందరు ప్రశంసిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.శిరీష్ కెరీర్‌ గురించి మీరు ఏమంటారు.?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube