సనాతన ధర్మంలో ఆరాధన అనేది మన జీవితంలో ఏర్పడే సమస్యలను అధిగమించడానికి, భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గంగా పరిగణిస్తారు.దైవాన్ని కొలుస్తూ మనస్పూర్తిగా చేసే పూజలు ( Pooja ) నియమా నిష్టలతో చేస్తే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.
అదే సమయంలో కొన్ని మంత్రాలు( Mantras ) పాటించడం వల్ల కూడా భగవంతుని అనుగ్రహం పొందడానికి మంచి మార్గమని పురాణాలు చెబుతున్నాయి.
సనాతన ధర్మం ప్రకారం మనిషి మంత్రాలను పాటించడం లేదా వాటిని వినడం ద్వారా శక్తిని పొందుతాడు.
ఈ మంత్రాలు చాలా అద్భుతం అని నిరూపించబడ్డాయి.మంత్రాలను హృదయ పూర్వకంగా జపిస్తే జీవితంలో డబ్బు కష్టాలు, అనారోగ్యం ఇంటిలో ఏర్పడే ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి.
ఏ మంత్రాలన్నీ ఎలా జపించాలో, ఈ మంత్రాలను జపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలు దూరం అయిపోతాయి.అలాగే ఈ మంత్రాన్ని జపించడం వల్ల హనుమంతుడు( Hanuman ) అన్ని కష్టాలను దూరం చేస్తాడు.శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నప్పుడు జపించడం ఎంతో మంచిది.
ఇలా చేయడం వల్ల పనిలో విజయం సాధించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాల్లో, పెళ్లిల్లో విఘ్నలు కలగకుండా ఈ మంత్రాన్ని జపించి గణపతిని పూజించాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా రోజుల నుంచి మీ మనసులో ఉన్న మంచి మంచి కోరికలు నెరవేరుతాయి.అలాగే ఈ మంత్రం జపించడం వల్ల అదృష్టం ఎప్పుడు మీ వెంట ఉంటుంది.ఓం ఘృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉన్నా లేదా సూర్య దోషం ఉన్న సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఈ దోషాలు దూరం అయిపోతాయి.ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై శుభాలు కలుగుతాయి.
DEVOTIONAL