నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో జూపల్లితో పాటు రైతులను పోలీసులు అడ్డుకున్నారు.కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన మాజీ మంత్రి జూపల్లి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.