ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్, అలీగఢ్ ఎక్స్‌ప్రెస్ హైవే ( Aligarh Express Highway )నిర్మాణం కొత్త పుంతలు తొక్కింది.తాజాగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.
దాదాపు 100 కిలోమీటర్ల పొడవైన రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ విషయమై జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ అధికారికంగా ఓ ప్రకటన చేసారు.
ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణంలో భాగస్వాములైన వారిని అభినందించేందుకు ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari )వర్చువల్‌గా పాల్గొన్నట్టు తెలుస్తోంది.ఎన్‌హెచ్-34లో ఘజియాబాద్-అలీగఢ్ మధ్య 118 కిలోమీటర్ల పొడవైన మార్గం ఎంతో కీలకమని.జనసాంద్రత ఎక్కవగా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని దాద్రి( Uttar Pradesh ), సికందర్‌బాద్, కుర్జా, గౌతమ్ బుద్ధ్ నగర్ తదితర పట్టణాలను కలుపేలా ఈ రహదారి వెళ్తుండటం ప్రజలను ఎంతగానో కలిసొచ్చే అంశమని గడ్కరీ పేర్కొన్నారు.
ఈ క్రమంలో వ్యాపార నిర్వహణకు ఈ రహదారి కీలకంగా మారనుందని అన్నారు.ఇంకా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ.ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రీన్ టెక్నాలజీని కూడా వినియోగించినట్లు చెబుతున్నారు.దాదాపు 90 శాతం మిల్లింగ్ మెటీరియల్‌ను ఉపయోగించడం వల్ల రహదారి నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను చాలా వరకు తగ్గించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ విజయం మన దేశంలో రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు గల పట్టుదల, కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది.