100 కి.మీ రోడ్డుని 100 గంటల్లోనే నిర్మించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన భారత్!
TeluguStop.com
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్, అలీగఢ్ ఎక్స్‌ప్రెస్ హైవే ( Aligarh Express Highway )నిర్మాణం కొత్త పుంతలు తొక్కింది.
తాజాగా సరికొత్త రికార్డు నమోదు చేసింది.దాదాపు 100 కిలోమీటర్ల పొడవైన రహదారిని కేవలం 100 గంటల్లోనే నిర్మించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయమై జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ అధికారికంగా ఓ ప్రకటన చేసారు.
ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణంలో భాగస్వాములైన వారిని అభినందించేందుకు ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు.
"""/" /
ఈ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari )వర్చువల్‌గా పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ఎన్‌హెచ్-34లో ఘజియాబాద్-అలీగఢ్ మధ్య 118 కిలోమీటర్ల పొడవైన మార్గం ఎంతో కీలకమని.జనసాంద్రత ఎక్కవగా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని దాద్రి( Uttar Pradesh ), సికందర్‌బాద్, కుర్జా, గౌతమ్ బుద్ధ్ నగర్ తదితర పట్టణాలను కలుపేలా ఈ రహదారి వెళ్తుండటం ప్రజలను ఎంతగానో కలిసొచ్చే అంశమని గడ్కరీ పేర్కొన్నారు.
"""/" /
ఈ క్రమంలో వ్యాపార నిర్వహణకు ఈ రహదారి కీలకంగా మారనుందని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ.ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రీన్ టెక్నాలజీని కూడా వినియోగించినట్లు చెబుతున్నారు.దాదాపు 90 శాతం మిల్లింగ్ మెటీరియల్‌ను ఉపయోగించడం వల్ల రహదారి నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను చాలా వరకు తగ్గించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ విజయం మన దేశంలో రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమకు గల పట్టుదల, కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది.
స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తా… జడ్జ్ చేయను పూరి సినిమాపై విజయ్ సేతుపతి కామెంట్స్!