కొత్తగా వివాహమైన ప్రతి జంట తల్లిదండ్రులు కావాలని కలలు కంటూ ఉంటారు.అలాగే కొత్త దంపతులకు కలిగిన పిల్లలకు మంచి పేర్లు పెట్టాలని అనుకుంటూ ఉంటారు.
ఈ నెలలో పుట్టిన అబ్బాయిలకు మంచి పేర్లు పెట్టడానికి ఆలోచిస్తున్నారా, అయితే A అక్షరంతో( letter A ) మొదలయ్యే మంచి పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొదటిగా అహన్( Ahan ) అనే పేరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
అలాగే అహన్ అంటే సూర్యాస్తమయం అని, కాంతి ఉదయానికి మూలం అని కూడా అర్ధాలు వస్తాయి.

అలాగే ఆరవ్( Arav ) అనే పేరు ఈ మధ్యకాలంలో తమ పిల్లలకు ఎక్కువగా పెట్టుకుంటూ ఉన్నారు.ఈ పేరుకు అందమైన అర్థం ఉంది.ఆరవ్ అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది.
ఈ పేరు గలవారు చాలా ప్రశాంతంగా ఉంటారు.అలాగే ఈ పేరు గలవారు చాలా ధైర్యంగా ఉంటారు.
ఇంకా చెప్పాలంటే అగస్త్య( Agastya ) అనే పేరు చాలా పాత పేరు లా అనిపించినా ఇప్పటికీ కూడా ఈ పేరంటే చాలామందికి ఎంతో ఇష్టం.ఈ పేరుకి అర్థం జ్ఞానం అని పండితులు చెబుతున్నారు.

అలాగే అద్విక్( Advik ) అనే పేరు చాలా క్యూట్ గా ఉండడంతో పాటు చాలా చిన్నగా ఉంటుంది.ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి.దీని అర్థం సృజనాత్మకత అని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే అమేయ అనే పేరు గణేశునికి మరో పేరు అని పండితులు చెబుతున్నారు.ఈ పేరు చాలా వెరైటీగా ఉంటుంది.ఈ పేరుకు ఏ తప్పులు చేయనివాడని అర్థం వస్తుంది.
అలాగే తప్పులు మరియు చెడు ఆలోచనలు లేనివాడని మరొక అర్థం వస్తుంది.అంతేకాకుండా అన్షుల్( Anshul ) అనే పేరు చాలా వెరైటీగా, క్యూట్ గా కూడా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఈ పేరుకు చాలా ప్రత్యేకమైన అర్థం వస్తుంది.సూర్యుని కిరణం వలె ప్రకాశించేవాడు అని అర్థం వస్తుంది.
ఈ పేరుకు తెలివైన మరియు శక్తివంతమైన అని కూడా అర్థం.