ఇది పేదలకు పెద్దలకు మధ్యన పోటీ: జగన్

ఎటువంటి షరతులు లేకుండా పొత్తులకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్పష్టం చేయడంతో ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ రోడ్ మ్యాప్ క్లియర్ అయిపోయింది .వైయస్సార్ కాంగ్రెస్ ఒకపక్క తెలుగుదేశం జనసేన మరోపక్క నిలబడి కనబడతాయని స్పష్టమైంది.

 Jagan Following New Stratagies To Facec Janasena Tdp Alliance , Janasena, Tdp,-TeluguStop.com

భాజపా సంగతి తేలాల్సి ఉన్న దాన్ని ఓటు బ్యాంకు పాలితాలను ప్రభావితం చేసే స్థాయిలో లేకపోవడం వల్ల సమీకరణాలు మారే అవకాశం లేదు.జనసేన టిడిపి కలయికను ఎదుర్కోవడానికి మరో కొత్త సమీకరణాన్ని జగన్( Jagan ) తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది తమది పేదలకు మేలు చేసే పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేద ఇంటికి మేలు చేసిన ఘనత తమదే అని ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలను ఆపడానికే ఆ పెద్దలందరూ కలిసికూటమి కడుతున్నారంటూ ఆయన విమర్శలు చేశారు.

Telugu Congress, Jagan, Janasena, Sajjala-Telugu Political News

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( Congress party ) అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలు ఆర్థికంగా బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు.ప్రభుత్వ అమలు చేస్తున్న చాలా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు దిగువ మధ్యతరగతి మరియు పేదవారే ….అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత తమ ఓటర్లు వేరే ఉన్నారు అని సజ్జల( sajjala ) లాంటి అధికార ప్రతినిధులు వ్యాఖ్యానించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల మధ్యతరగతిలో కొంత అసంతృప్తి ఉందని అంచనాలు ఉన్నాయి .అందరి దగ్గర పన్నులు కట్టించుకుని కొందరికి మాత్రమే మేలు చేస్తున్నారంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తమకు బలమైన మద్దతు ఉందని భావిస్తున్న బలహీన వర్గాలను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Congress, Jagan, Janasena, Sajjala-Telugu Political News

జనసేన( janasena ) తెలుగుదేశం కలయిక దాదాపు కన్ఫామ్ అయిపోవడంతో తమకు మద్దతు ఇచ్చే వర్గాలు ఏవి అన్న విషయంలో ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది.దళిత క్రిస్టియన్ ఓటు బ్యాంకుతోపాటు ఆర్థికంగా బలహీన వర్గాల ఓటు బ్యాంకు ను పొందగలిగితే అదే తమను అధికారం వైపుగా మరోసారి నడిపిస్తుందని వైసీపీ పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.అందువల్ల మళ్లీ తాము అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయన్న సంకేతాలను ఆయా వర్గాలకు ఇవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఒక పక్క తెలుగుదేశం( telugudesam ) జనసేన సామాజిక వర్గాల కలయిక గురించి లెక్కలు కట్టుకుంటుంటే మరోవైపు జగన్ పేద ధనిక తేడాలు తీసి కొన్ని వర్గాల ఓట్లు కొల్లగొట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

మరి ఎవరి వ్యూహాలు విజయవంతం అవుతాయో రానున్న రోజుల్లో తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube