ఎంపీ విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రముఖ దిగ్గజ రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు విజయేంద్ర ప్రసాద్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.అసలేం జరిగిందంటే.
నైజాం విముక్త స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు శుక్రవారం హైదరాబాద్ లోని ఎఫ్‌ఎఫ్‌సీసీలో జరిగాయి.నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన వీరులు కుమురం భీమ్, రాంజీ గోండ్, షాయబుల్లాఖాన్, జమలాపురం కేశవరావు, చాకలి ఐలమ్మ వంటి వారి పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ వేడుక నిర్వహించారు.
ఇందులో భాగంగా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ రైటర్ విజయేంద్రప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజకార్ల గురించి, తెలంగాణ సాయుధ పోరాట యోధుల గురించి ఆయన తెలిపారు.రాజకార్ల పై తెలంగాణలో మహిళలు, గ్రామీణులు తిరగబడి వేయ్ వేయ్ ధరువేయ్ అంటూ పాడుతూ వారిని ఎదురించి సంఘటనలు తాను సుద్దాల హన్మంతు ద్వారా తెలుసుకున్నానని వెల్లడించారు.రాజకార్ల ఆగడాలను ప్రస్తావిస్తూ తెలంగాణ వీరులను ఆయన కొనియాడారు.
నేను ఆర్‌ఎస్‌ఎస్ పై( RSS ) సినిమా తీస్తున్నట్టు వెల్లడించారు.ఐదేళ్లకి ముందు వరకు తనకు ఆర్‌ఎస్‌ఎస్ గురించి తెలియదని, అంతేకాకుండా భారతదేశంలో చాలా మంది దానిపై ఉన్న అభిప్రాయాన్నే తాను కలిగి ఉన్నానని, గాంధీని హత్య చేసినదాంట్లో ఈ సంస్థకి సంబంధం ఉందని తాను కూడా నమ్మానని తెలిపారు.
కానీ ఆర్‌ఎస్‌ఎస్‌పై సినిమా తీయాలనుకున్నప్పుడు ఐదేళ్ల క్రితం మోహన్ భగవత్ ని( Mohan Bhagawat ) కలిసిన తర్వాత తాను చాలా రియలైజ్ అయ్యానని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.అయితే ఇన్నాళ్లు తాను ఈ సంస్థ గురించి తెలుసుకోనందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపించిందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్.అలాగే తాను ఈ విషయంలో చేసిన తప్పుకి, పొరపాటుని సరిదిద్దుకునేందుకు గాను ఆర్‌ఎస్‌ఎస్ గొప్పతనం గురించి భారత దేశ ప్రజలందుకు తెలుసుకునేలా, తెలిసేలా సినిమా తీయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.కాగా ఈ సందర్బంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి.