2023 సంవత్సరంలోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో రామబాణం సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా ఫుల్ రన్ లో 3 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సాధించలేదు.
డైరెక్టర్ శ్రీవాస్( Director Srivaas ) పరువు తీసేలా ఈ సినిమా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.గోపీచంద్ కెరీర్ పై కూడా ఈ సినిమా ప్రభావం ఎక్కువగానే పడిందని సమాచారం అందుతోంది.
గోపీచంద్ పారితోషికం ప్రస్తుతం 5 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
అయితే ఆయన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నట్టు సమాచారం.
గోపీచంద్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా ఇకనైనా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది సూచనలు చేస్తున్నారు. కన్నడ డైరెక్టర్ హర్ష( Kannada Director Harsha ) డైరెక్షన్ లో గోపీచంద్ తర్వాత మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం.
గోపీచంద్ 31వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.గోపీచంద్ తర్వాత సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ఈ హీరో స్థాయిని పెంచుతాయేమో చూడాల్సి ఉంది.గోపీచంద్ మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా( Social Media )లో కామెంట్లు చేస్తున్నారు.
గోపీచంద్ కథలకు సంబంధించి జడ్జిమెంట్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారని ఆయనకు ఎందుకు హిట్లు రావడం లేదో అర్థం కావడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
గోపీచంద్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని మిడిల్ రేంజ్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గోపీచంద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా మాస్ మసాలా సినిమాలకు ఎక్కువగా గోపీచంద్ ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇతర భాషల్లో కూడా గోపీచంద్ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గోపీచంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.