టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్( Sandeep Kishan ) గురించి మనందరికీ తెలిసిందే.సందీప్ కిషన్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే సందీప్ నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన( Bhairavakona ).ఇందులో కావ్య థాపర్, వర్ష ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమాకు వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించారు.ఇది ఇలా ఉంటే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.ఇక ఈ కార్యక్రమంలో హీరో సందీప్ డైరెక్టర్ ఆనంద్ నిర్మాత అనిల్ సుంకరతో ( producer Anil Sunkar )పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.ఈ ఊరి పేరు భైరవకోన సినిమా ప్రాజెక్ట్ ని మేము రెండేళ్ల క్రితమే మొదలు పెట్టాము.డైరెక్టర్ ఆనంద్( Director Anand ) రాసే కథలన్నీ కూడా నాతో చెబుతూ ఉండేవారు అలా ఈ భైరవకోన సినిమా కథ రాసి అందులో నన్ను నటించమని అడిగారు.
నాకు ఎక్కువగా హర్రర్ సినిమాలు చేయడం అన్నా చూడటం అన్న చాలా ఇష్టం.అందుకే ఈ ప్రాజెక్టుకి వెంటనే ఓకే చెప్పేసాను.నా జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ నేను నా జర్నీ పట్ల సంతోషంగానే ఉన్నాను.ఈ జర్నీలో ఇప్పటివరకు నేను ఎన్నో విషయాలను తెలుసుకున్నాను.
ఇష్టం లేకుండా కొన్ని సినిమాలు చేశాను.అలా చేసిన రెండు మూడు సినిమాలు వదిలేసి ఉండాల్సింది.
అవితప్ప నా కెరియర్ లో మార్చుకోవడానికి ఇంకా ఏమీ లేవు.ఇకపోతే మైఖేల్( Michael ) సినిమాకు మేము ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని డెలివరీ చేయలేకపోయాము.ఆ సినిమాతో మేము మంచి పేరును సాధించాము.ఆ విషయానికి నేను గర్విస్తున్నాను.మేము ఎంతో కష్టపడ్డామని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది.ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు దక్కింది అని చెప్పుకొచ్చారు సందీప్ కిషన్.
డబ్బులు కూడా వచ్చాయి.ఒకవేళ మేము ఆ సినిమా ఉంది రీసెట్ చేసుకొని ఉంటే ఏదైనా మార్పులు చేసే వాళ్ళము.
కానీ దానికి సమయం దొరకలేదు అని తెలిపారు సందీప్.అనంతరం భైరవకోన సినిమా గురించి మాట్లాడుతూ.
ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు సందీప్ కిషన్.