రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని మార్కెట్ యార్డ్ లో పోసిన వరి ధాన్యం అకాల వర్షాల వలన తడిసి ముద్దయింది.గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌతంరావు మాట్లాడుతూ రైతులు ఆరు నెలలు కష్టపడి పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యంతో అకాల వర్షాలు పడి ధాన్యం తడిసి ముద్దయిందని, అందుకు రైతులు ఆందోళన పడవద్దని అన్నారు.మన ముఖ్యమంత్రి రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే
రైతుబీమా, రైతుబంధు,ఉచిత విద్యుత్తు వంటి అనేక పథకాలు రైతులకు అందిస్తున్నారని తెలియజేశారు, వేసవిలో సాగునీరు లేక పంటలు ఎండిపోతాయని మానేరు ప్రాజెక్టు నిండు వేసవిలో నింపిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని అన్నారు.
ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తారని రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్,ఉప సర్పంచ్ మంజుల రమేష్, ఎంపిటిసి కొండని బాలకిషన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.