కేటీఆర్ రాజీనామా చేయాలంటూ షర్మిల సంచలన పోస్ట్..!!

YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల అధికార పార్టీ BRS పై గట్టిగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇటీవలే సిట్ దర్యాప్తు ఆలస్యం అవుతుందని లోటస్ పాండ్ నుండి సిట్ కార్యాలయానికి బయలుదేరటానికి…అధికారులను .

నిలదీయటానికి షర్మిల రెడీ అయిన క్రమంలో… పోలీసులతో వాగ్వాదానికి దిగి తోపులాట జరిగి ఆమెపై కేసు నమోదు అయింది.ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లడం జరిగింది.

తర్వాత బెయిల్ పై బయటకు రావడం జరిగింది.అయిన గాని ప్రజా సమస్యల విషయంలో వైయస్ షర్మిల దూకుడుగా దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో సికింద్రాబాద్ లో మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి మృతి చెందడంతో దీనికి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.“సికింద్రాబాద్ లోని కళాసిగూడలో చిన్నారి మౌనిక మ్యాన్ హోల్ లో పడి మృతి చెందటం తీవ్రంగా కలిచివేసింది.GHMC నిర్లక్యంతో ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి దొర?? ఒక వైపు కుక్కల దాడి,మరోవైపు మ్యాన్‌హోల్స్ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లో మాత్రం చలనం లేదు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

దీనికి నైతిక బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలి” అని షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube