ముంబైలో డే అండ్‌ నైట్ కష్టపడుతున్న పవన్‌ కళ్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం సాహో సుజీత్( Saaho Sujeeth ) దర్శకత్వం లో రూపొందుతున్న ఓ జీ సినిమా కోసం ముంబై లో ఉన్న విషయం తెలిసిందే.అక్కడ ఒక భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

 Pawan Kalyan Og Movie Shooting Update , Pawan Kalyan, Og Movie, Saaho Sujeeth,-TeluguStop.com

చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కాకుండా వేరే రాష్ట్రంలో చిత్రీకరణకు వెళ్లడం జరిగింది.ముంబైలో అత్యంత కీలకమైన సన్నివేశాలను దర్శకుడు సుజీత్ చిత్రీకరిస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇప్పటికే ఒక మేకింగ్ వీడియో ను షేర్ చేయడం ద్వారా సినిమా పై అంచనాలను భారీ గా పెంచారు.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఆ షెడ్యూల్‌ పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ వచ్చి అక్కడ నుండి ఏపీ కి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానుల నుండి సమాచారం అందుతోంది.

త్వరగా ముంబై( Mumbai ) షెడ్యూల్ ని ముగించాలని దర్శకుడు సుజీత్ కి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది.మొదట ముంబై షెడ్యూల్ ని దాదాపుగా పది నుండి 12 రోజుల పాటు అనుకున్నారట.కానీ పవన్ కళ్యాణ్ డే అండ్ నైట్ తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

దాంతో వారం లోపే సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.అక్కడి నుండి వచ్చిన తర్వాత కూడా వెంటనే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్‌ ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.మరో వైపు రెండు సినిమాలు రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతోంది.ఈ సినిమా ల్లో ఏది ముందు… ఏది చివరిలో వస్తుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube