ప్రేమించిన అమ్మాయిలో తప్ప మిగతా అందర్లో అమ్మను చూడాలి.. సాయితేజ్ కామెంట్స్ వైరల్!

సాయితేజ్( Sai Tej ) నటించిన విరూపాక్ష మూవీ( Virupaksha movie ) మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ( Karthik Dandu )డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై పరవాలేదనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

 Hero Saitej Shocking Comments About Lover Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయితేజ్ మాట్లాడుతూ నేను ఈ స్టేజ్ పై ఉండటానికి ముగ్గురు మామయ్యలు కారణమని అన్నారు.అమ్మ కోసం, వైష్ణవ్ కోసం ఈ సినిమా చేస్తున్నానని సాయితేజ్ తెలిపారు.

2009లో సినిమా జర్నీ మొదలైందని 2014లో నా రెండో సినిమా పిల్లా నువ్వులేని జీవితం మొదటి సినిమాగా విడుదలైందని సాయితేజ్ పేర్కొన్నారు.2016లో సుప్రీం విడుదలైన తర్వాత ఆరు ఫ్లాపులు వచ్చాయని ఆయన తెలిపారు.చిత్రలహరి సినిమాతో ఫ్లాపులకు బ్రేక్ పడిందని సాయితేజ్ కామెంట్లు చేశారు.నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ అప్పటినుంచి ఇప్పటివరకు సపోర్ట్ గా ఉన్నారని ఆయన తెలిపారు.

బైక్ అంటే నాకు ప్రాణమని యాక్సిడెంట్ నుంచి లేచిన తర్వాత నాకు మాట రాలేదని సాయితేజ్ పేర్కొన్నారు.మాటలు రాకపోవడంతో అమ్మ, తమ్ముడికి సారీ, ఐలవ్యూ చెప్పలేకపోయానని బాధ పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.నేను సింపతీ కోసం ఈ మాటలు చెప్పట్లేదని ఆయన తెలిపారు.

అమ్మ, నాన్న, గురువు గర్వపడేలా చేయాలని సాయితేజ్ అన్నారు.ప్రేమించిన అమ్మాయిలో తప్ప మిగతా అందర్లో అమ్మను చూడాలని ఆయన తెలిపారు.

విరూపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ అని అభిమానుల కోసం ఈ సినిమా చేశానని సాయితేజ్ వెల్లడించారు.సుకుమార్ కథ పంపిస్తున్నానని చెబితే లవ్ స్టోరీ అనుకున్నానని కానీ హర్రర్ మూవీ ( Horror movie )అని తర్వాత తెలిసిందని ఆయన పేర్కొన్నారు.నాకు నిర్మాతల నుంచి చాలా సపోర్ట్ లభించిందని సాయితేజ్ వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube