భారత్‌లోని ఆ చివరి గ్రామం నుంచి చైనాకు మోదీ సందేశం... ఏమయ్యుంటుందబ్బా?

‘కిబితూ’( Kibitoo ) గ్రామం గురించి విన్నారా? బహుశా చాలా తక్కువమందికి ఈ గ్రామం గురించి తెలుసు.దేశంలోని చివరిగ్రామంగా కిబితూకి పేరు.

 Modis Message To China From That Last Village In India What Is Going On-TeluguStop.com

దీని గురించి అమిత్ షా తాజాగా మాట్లాడుతూ… కిబితూ భారత్‌లోని చివరి గ్రామం కాదు, ఇది భారత్‌లోని మొదటి గ్రామమని వ్యాఖ్యానించారు.ఈ గ్రామం పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాలా విషయాలను చెప్పుకొచ్చారు.

కాగా అమిత్ షా, అరుణాచల్ ప్రదేశ్‌లో( Amit Shah ) రెండు రోజులు చేసిన పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.

విషయంలోకి వెళితే, గాల్వన్ వ్యాలీలో( Galvan Valley ) 2020లో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దాదాపుగా దెబ్బతిన్నాయి.సదరు పర్యటనలో భాగంగా భారత భూభాగాలను ఎవ్వరూ ఆక్రమించలేరని అమిత్ షా మాట్లాడుతూ చైనా పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం అంజావ్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కిబితూలో రూ.4,800 కోట్ల వ్యయంతో చేపట్టిన ”వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌”ను అమిత్ షా ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసారు అమిత్.

ఈ సందర్భంగా ఆయన భారత భూభాగాలను ఆక్రమించే రోజులు పోయాయని, కనీసం సూది మొన పరిమాణంలోని భూమిని కూడా ఎవరూ ఇక్కడ ఆక్రమించలేరని అన్నారు.చైనా ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు చైనీస్ పేర్లను పెట్టిన సంగతి విదితమే.ఇందులో అరుణాచల్ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు సమీపంలోని ఒక పట్టణం కూడా ఉంది.

ఇకపోతే భారత భూభాగాల పేర్లను చైనా మార్చడాన్ని భారత్ చాలా తీవ్రంగా ఖండించింది.స్థలాలకు, ప్రామాణిక భౌగోళిక పేర్లను ఇవ్వాలంటూ చైనా మూడోసారి ఈ ప్రయత్నం చేయడం భారత్ కి ఏమాత్రం నచ్చడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube