రాజన్న సిరిసిల్ల జిల్లా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిరిసిల్ల బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 129వ ఫౌండేషన్ డే సందర్భంగా బ్యాంకు నందు కస్టమర్స్ కి అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఎం వి రూరల్ ఫోక్ ఆర్ట్ఆర్గనైజేషన్ హైదరాబాద్ కళాజాత వారు బ్యాంక్ స్కీమ్స్ గురించి బ్యాంకు పథకాల గురించి, బ్యాంకు లోన్స్ గురించి ముఖ్యంగా గోల్డ్ లోను గురించి, సామాజిక భద్రత పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, డిజిటల్ లావాదేవీల గురించి,
సైబర్ మోసాల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిగా మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా తెలియజేశారు.
ఈ కార్యక్రమం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా.ఎల్ డి ఎం మల్లికార్జున, బ్యాంకు మేనేజర్ రాఘవేంద్ర ఫీల్డ్ ఆఫీసర్ శాంత కుమార్, క్లర్కు మధు క్యాషియర్ సునీల్, సహాయ సిబ్బంది నవీన్ లీడ్ బ్యాంక్ కౌన్సిలర్ వెంకట రమణ బ్యాంకు కస్టమర్స్ కళాజాత బృందం సభ్యులు విజయ్ మెజీషియన్ డప్పు ప్లేయర్ తేజ పాల్గొన్నారు.