భూ సెటిల్మెంట్ ఆరోపణలపై వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి స్పందించారు.ఆరోపిస్తున్న భూమి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదని చెప్పారు.
పంచాయతీ తన వద్దకు వచ్చిన విషయం వాస్తవమేనని ఎమ్మెల్యే తెలిపారు.ఈ క్రమంలో ఇరు వర్గాలకు రాజీ కుదుర్చుకోమని చెప్పానన్నారు.
కానీ తాను ఎలాంటి సెటిల్మెంట్ చేయలేదని వెల్లడించారు.నవీన్ ఎవరో తనకు తెలియదని, ఆ భూమి ఎక్కడుందో కూడా తనకు తెలియదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
సదరు వివాదంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.