ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తూ,పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని అలాగే ఆంగ్ల భోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేయడానికి ఎంతగానో కృషిగావించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న మహనీయుడు మంకు రాజయ్య అని అతని జయంతి సందర్భంగా టీచర్స్ ప్రీమియం లీగ్ నిర్వహించడం సంతోషదాయకమని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు.శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయని అలాగే ఈరోజు క్రీడలకు ఆవశ్యకత ఎంతో ఉందని విద్యార్థులను కూడా ఆసక్తి కలిగేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా డీఈవో రమేష్ టాస్ వేసి ఫైనల్ మ్యాచ్ ని ప్రారంభించారు.పదమూడు మండలాలు నాలుగు జట్లుగా లీగ్స్ ఆడగా టీచర్స్ ప్రీమియర్ లీగ్ లో సర్జిపూల్ స్ట్రైకర్స్ విన్నర్స్ గా మానేరు మాస్టర్స్ రన్నర్స్ గా నిలిచారు.
ఈ కార్యక్రమంలో డీఈవో రమేష్ ,మంకు శైలజ ,మంకు లాస్య, శర్మన్ నాయక్ ,పర్ష హన్నాండ్లు, బూర్క గోపాల్, మైలారమ్ తిరుపతి, పంజాల వెంకటేశ్వర్లు,దేవత ప్రభాకర్ గారు నిర్వాహకులు జక్కని నవీన్, జయకృష్ణ, కొండి కొప్పుల రవి,భాస్కర్ రెడ్డి, రవీందర్,వంగ తిరుపతి,సంతోష్,ఉపాధ్యాయ సంఘాల నాయకులు లకవత్ మోతలాల్,గన్నమనేని శ్రీనివాస రావు, దోర్నాల భూపాల్ రెడ్డి, బోయాన్న గారి నారాయణ, గోల్కొండ శ్రీధర్, గుండమనేనీ మహెందర్ రావు,హజు నాయక్,పిట్టల దేవరాజు, లక్ష్మణ్,సదానందం, దొంతుల శ్రీహరి,తడుకల సురేష్ లు పాల్గొన్నారు.