ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ లేకుండా అల్లు అర్జున్ నటించిన సినిమా ఏంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పుష్ప 2 సినిమా(Pushpa 2Movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నఅల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

 Do You Know The Movie Starring Allu Arjun Without A Single Rupee Remuneration, G-TeluguStop.com

ఇక నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేయగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ 41 పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా అభిమానులు సెలబ్రెటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ విధంగా అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు ఇప్పుడు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న అల్లు అర్జున్ ఒక సినిమాకు మాత్రం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఉచితంగా నటించారని చాలామందికి తెలియదు.

మరి ఈయన రెమ్యునరేషన్ లేకుండా నటించిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.

గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వంలో అనుష్క శెట్టి, నిత్యామీనన్, రానా, కృష్ణంరాజు వంటి పలువురు సెలబ్రిటీలు నటించినటువంటి రుద్రమదేవి(Rudhramadevi) సినిమాలో అల్లు అర్జున్ కూడా గోనగన్నారెడ్డి(Gonaganna Reddy) పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ లేకుండా ఉచితంగా నటించారట.ఈ సినిమా నష్టాలలో ఉండటంతో ఈ సినిమాకి అల్లు అర్జున్ లాంటి స్టార్స్ అవసరమవుతారని తెలియడంతో ఈయన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట.

అదే విధంగా గుణశేఖర్ గారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రెమ్యూనరేషన్ లేకుండా అల్లు అర్జున్ నటించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube