అల్లు అర్జున్ తో పాటు నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న సెలబ్రిటీలు వీళ్లే?

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక నేడు (ఏప్రిల్ 8వ తేదీ) అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప 2 సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 These Are The Celebrities Are Celebrating Birthday Today Along With Allu Arjun A-TeluguStop.com

ఇకపోతే నేడు అల్లు అర్జున్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీలు ఎవరు ఏంటి అనే విషయానికి…

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఒకరు.

ఇక నేడు అఖిల్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సెలబ్రిటీలు అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సమంత(Samantha) కూడా తన మాజీ మరిదికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

ఇక ఈయన నటించిన తాజా చిత్రం ఏజెంట్ ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానుంది.

ఇక మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు ఇక నేడు ఈయన కుమారుడు అకీరానందన్(Akira Nandan) పుట్టినరోజు కావడం విశేషం.నేడు అకిరా పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పవన్ అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.జూనియర్ పవర్ స్టార్ అంటూ పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అకిరా నందన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక వీరితోపాటు నేడు మలయాళీ ముద్దుగుమ్మ నటి నిత్యమీనన్(Nitya Menon) సైతం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిత్యమీనన్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక నేడు నిత్యమీనన్ సైతం పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube