రామభక్తుడైన మహాబలి హనుమంతుడికి( Hanuman ) చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది.హిందూ మతంలోని పంచాంగం ప్రకారం హనుమంతుడి పుట్టిన తేదీ చైత్రమాసం పౌర్ణమి నాడుగా చెప్పబడింది.
అయితే ఆరోజు చైత్ర పున్నమి కనుక దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి( Hanuman Jayanti ) వేడుకలను జరుపుకుంటారు.ఆ రోజున హనుమంతుడిని నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి భక్తులు కోరిన ఉత్తమ కోరికలు కూడా నెరవేరుతాయి.
అయితే దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవాన్ని రెండు రోజులు జరుపుకుంటారు.
ఇక మరికొందరు కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి( Krishna Paksha Chaturdashi ) రోజున కూడా పరిగణిస్తారు.
భజరంగబలి పుట్టిన రెండు తేదీలను చూస్తే ఏ తేదీ అసలైన తేదీ అనే ప్రశ్న తరచూ ప్రజల్లో తలెత్తుతుంది.అయితే హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
పవన తనయుడు అయినా హనుమంతుడు పుట్టిన తేదీని ఆయన జన్మదినోత్సవంగా జరుపుకుంటే మరో తేదీని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు.ఎందుకంటే కష్టాల నుంచి రక్షణ ఇచ్చే హనుమంతుడు మంగళవారం నాడు కార్తీక మాసంలోనే కృష్ణపక్షం చతుర్దశ తిధినాడు మేషరాశిలో జన్మించారు.
అయితే హనుమంతుడు పుట్టినప్పటినుంచి ఆయనకు ఎన్నో అద్భుతమైన శక్తులు కలిగాయి.ఒకసారి చిన్నారిగా ఉన్న హనుమాన్ సూర్యుడిని చూసి పండు అని భావించి దాన్ని తినడానికి ప్రయత్నించాడు.అలా సూర్య దేవుడిని పండు గా భావించి హనుమంతుడు తినబోతుండగా దేవేంద్రుడు( Devendrudu ) ప్రత్యక్షమయ్యాడు.హనుమంతుడి పై కోపం తో దాడి చేశాడు.దీంతో చిన్నారి హనుమాన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.ఈ సంఘటన గురించి తెలుసుకున్న వాయుదేవుడికి కోపం వచ్చి గాలి ప్రవాహాన్ని నిలిపివేశారు.
అప్పుడు విశ్వంలో సంక్షోభం ఏర్పడింది.దీంతో దేవతలందరూ కలిసి సహాయం కోసం బ్రహ్మదేవుని వద్దకు వెళతారు.ఆ సమయంలో బ్రహ్మ స్వయంగా ఇతర దేవతలతో కలిసి వాయుదేవుని వద్దకు వెళ్లి హనుమాన్ కు మళ్లీ జీవం పోస్తారు.దీంతో రెండవ జీవితాన్ని ఇస్తారు.ఇలా దేవతలు అందరూ తమ శక్తులను చిన్నారి హనుమాన్ కి ఇస్తారు.దీంతో ఆ రోజున హనుమంతుడు రెండవ జీవితాన్ని పొందాడు.
ఇలా రెండు జన్మలభించిన రోజు చైత్రమాసం పౌర్ణమి.అందుకే అప్పటినుంచి హనుమాన్ జయంతి కూడా ఈ తేదీన జరుపుకుంటారు.
DEVOTIONAL