హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది.పీడీఎస్ యూ కార్యకర్తలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.
టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, బోర్డ్ ఛైర్మన్ ను తొలగించాలని నిరసనకారులు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో పీడీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వాగ్వివాదం తోపులాటకు దారితీసింది.ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.







