రీల్స్ చేసేవారికి లక్ష రూపాయలు బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!!

సోషల్ మీడియా వచ్చాక చాలా మంది గుర్తింపు కోసం రకరకాలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో వీడియో క్లిక్ అయితే మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్… సదరు వ్యక్తికి ఏర్పడుతుంది.

 Telangana Government Has Announced A Bumper Offer Of One Lakh Rupees To Those Wh-TeluguStop.com

ఈ రకంగా పాపులారిటీతో పాటు వ్యూస్.బట్టి డబ్బులు కూడా సంపాదించుకుంటున్న వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు.

దీనిలో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో షార్ట్ రీల్స్( Short reels ) చేయటం ఇటీవల ఎక్కువైపోయింది.ఇలాంటి తరుణంలో తాజాగా కేసీఆర్ ప్రభుత్వం రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మేటర్ లోకి వెళ్తే హైదరాబాద్ ప్రత్యేకతలపై యూట్యూబ్ షార్ట్ రీల్స్( YouTube Short Reels ), ఫేస్ బుక్ షార్ట్ రీల్స్, ఇంస్టాగ్రామ్ షార్ట్ రీల్స్ ఇంట్రెస్టింగ్ గా చేసీ ఏప్రిల్ 30వ తారీకు లోపు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.ఈ క్రమంలో ఆ రీల్ పోస్ట్ చేసిన సమయంలో DigitalMedia Tsను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయాలి.అంతేకాక ఆ వీడియో లింక్ ను [email protected]కు మెయిల్ పంపాలని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ పేర్కొంది.

పోస్ట్ చేసిన వీడియో లలో బాగా సెలెక్ట్ అయిన వీడియోకి లక్ష రూపాయల నగదు బహుమతిగా ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.హైదరాబాద్ ప్రత్యేకత చాటే విషయంలో మొదటి నుండి కేసీఆర్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది.

ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మరింతగా హైదరాబాద్ నగరం ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా తెలిసే రీతిలో…ఈ రీల్స్ పోటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube