ఉపాసన ఆ విషయంలో చాలా లక్కీ.. భార్యపై ప్రేమతో చరణ్ అలా చేస్తానంటూ?

ఏ భార్య అయినా తనకు మంచి భర్త దొరకాలని కోరుకుంటుందనే సంగతి తెలిసిందే.అయితే ఉపాసనకు మాత్రం ఊహించని స్థాయిలో ప్రేమగా చూసుకునే భర్త చరణ్( Charan ) రూపంలో దొరికాడు.

 Upasana Lucky In That Matter Details Here Goes Viral In Social Media , Shankar,-TeluguStop.com

చరణ్ ప్రస్తుతం శంకర్( Shankar ) సినిమాతో బిజీగా ఉన్న ఉపాసన( upasana )పై ప్రేమతో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.ఈ విషయం గురించి తెలిసిన నెటిజన్లు చరణ్ మనస్సు బంగారం అని చెబుతున్నారు.

ఉపాసన కోసం రామ్ చరణ్ ప్యాటర్నిటీ లీవ్స్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.జులై ఆగష్టు నెలలలో ఉపాసన డెలివరీ అయ్యే అవకాశం ఉండగా ఆ సమయంలో ఉపాసనకు తోడుగా ఉండాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగులు ఈ తరహా సెలవులు తీసుకోవడం జరుగుతుంది.అయితే చరణ్ మాత్రం కార్పొరేట్ ఉద్యోగి కాకపోయినా భార్యపై ప్రేమతో ఈ పని చేస్తున్నారని తెలుస్తోంది.

శంకర్ సినిమాలో చరణ్ కు సంబంధించి మేజర్ సన్నివేశాలు పూర్తయ్యాయని మరో నాలుగు నెలల్లో ఈ సినిమాకు సంబంధించిన షూట్ పూర్తి కానుందని బోగట్టా.చరణ్ ఉపాసన ఆలస్యంగా పిల్లల్ని కనాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి అనుగుణంగా పిల్లల్ని కంటున్నారు.ఆర్థికంగా చరణ్ ఉపాసన ఊహించని స్థాయిలో స్థిరపడ్డారని తెలుస్తోంది.రామ్ చరణ్ ప్రస్తుతం భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

రామ్ చరణ్ బుచ్చిబాబు( Buchi Babu ) కాంబో మూవీ ఈ ఏడాదే మొదలుకానుందని తెలుస్తోంది.సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం.వరుస సినిమాలతో రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై కూడా ఫోకస్ పెడుతుండగా ఆ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో చూడాల్సి ఉంది.

హాలీవుడ్ లో కూడా చరణ్ సత్తా చాటుతారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube