గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్ లో ఫ్రాంచైజీలు వేలంలో కోట్లు గుమ్మరించి ప్లేయర్లను సొంతం చేసుకున్నాయి.దీనికి గల కారణం అందరికీ తెలిసిందే.
ఈ ఆటగాడు జట్టులో ఉంటే మ్యాచ్ కీలక మలుపు తిరిగి విజయం సొంతం అవుతుందనే క్రమంలో కొంతమంది ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ధరలో తగ్గేదేలే అంటూ ఫ్రాంచైజీలు దూకుడు ప్రదర్శించాయి.కానీ వేలంలో కోట్ల ధర పలికిన ఆటగాళ్లు మొదటి మ్యాచ్ లోనే ఫ్రాంచైజీ ఆశలపై నీళ్లు చల్లి నిరాశ పరిచారు.
టైటిల్ సాధిస్తారని ఆశతో జట్టులోకి తీసుకుంటే.కనీసం ప్లే ఆఫ్ కైనా తీసుకెళ్తారో లేదో అనే పరిస్థితులు ఎదురవుతున్నాయి.అత్యంత ధర పలికి నిరాశపరిచిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
కామెరాన్ గ్రీన్:
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అయినా ఈ ఆటగాడిని గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.17.5 కోట్లు గుమ్మరించి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.ఒకవైపు బ్యాటింగ్లో.మరోవైపు ఫీల్డింగ్ లో జట్టులో కీలక ప్లేయర్ అవుతాడని అనుకుంటే తొలి మ్యాచ్ లోనే నిరాశపరిచాడు.బెంగుళూరు- ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు.ఇక బౌలింగ్లో 2 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ తీశాడు.ముంబై ఇండియన్స్( Mumbai Indians ) ఘోరంగా ఓడిపోయింది.
హ్యారీ బ్రూక్:
ఇంగ్లాండ్ కు చెందిన ఈ ఆటగాడిని వేలంలో రూ.13.25 కోట్లు పెట్టి సన్రైజర్స్ హైదరాబాద్( SRH ) కొనుగోలు చేసింది.బ్యాటింగ్లో జట్టుకు వెన్నుముకలాగా ఉంటాడనుకుంటే, రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 21 బంతుల్లో 13 పరుగులు చేసి నిరాశ మిగిల్చాడు.72 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది.
బెన్ స్టోక్స్:
ఇంగ్లాండ్ కు చెందిన ఈ ఆటగాడిని రూ.16.25 కోట్లు పెట్టి చెన్నై జట్టు( CSK ) దక్కించుకుంది.గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగులు చేశాడు.లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 బంతులకు 8 పరుగులు చేసి, బౌలింగ్లో ఒకే ఓవర్ కు 18 పరుగులు ఇచ్చాడు.
సామ్ కరణ్:
ఈ సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చెప్పుకోవచ్చు.ఇతని కోసం పంజాబ్ ఏకంగా రూ.18.5 కోట్లు గుమ్మరించింది.అయితే కలకత్తా తో జరిగిన మ్యాచ్ లో 17 బంతులలో 26 పరుగులు చేశాడు.
ఇక బౌలింగ్లో మూడు ఓవర్లకు 38 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ తీశాడు.