జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.బీజేపీ( BJP ) జాతీయ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతూ వస్తున్నారు.
ఇప్పటికే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళి ధరన్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ జాతీయ అధ్యక్షుడు నడ్డా తో భేటీ అయ్యేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.నేడు సాయంత్రం వరకు నడ్డా తే పవన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జేపీ నడ్డా( JP Nadda ) తో మాత్రమే కాకుండా హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఒక వైపు ఏపీ లో బీజేపీ తో పవన్ కళ్యాణ్ తెగతెంపులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా ఉన్నట్లుండి ఢిల్లీ లో బీజేపీ జాతీయ నాయకులతో పవన్ జరుపుతున్న చర్చల గురించి ఏపీ రాజకీయ నాయకులు ఆసక్తిగా చూస్తున్నారు.
గత కొన్నాళ్లుగా బీజేపీ తో జనసేన తెంగతెంపులు అని ప్రచారం జరుగుతుంది.తెలుగు దేశం పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.మరో వైపు తెలుగు దేశం పార్టీ తో పొత్తు అనేది ఉండదని బీజేపీ నాయకులు తేల్చి చెబుతున్నారు.రాష్ట్ర బీజేపీ నాయకులు వాదనత మరియు జాతీయ నాయకత్వం వాదన ఒకటేనా అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ క్లారిటీ తీసుకుంటాడా.
ఒక వేళ తెలుగు దేశం పార్టీ తో కలిసి వెళ్దాం అంటూ బీజేపీ నాయకులతో పవన్ చెప్పే ప్రయత్నం చేస్తే వారి నుండి వచ్చే స్పందన ఏంటో అంటూ కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయం ఆసక్తికర మలుపు తీసుకునే అవకాశం ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.