క్యాబినెట్  ప్రక్షాళన కు జగన్ ముహూర్తం పెట్టేశారా ? వీరికేనా ఛాన్స్ ?

ఏపీ కేబినెట్( AP Cabinet ) ప్రక్షాళన కు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM Jagan ) సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.ఎప్పటి నుంచో మంత్రివర్గ ప్రక్షాళన పై ప్రస్తుత మంత్రులలో చాలామంది పనితీరుపై జగన్ ఆగ్రహంతో ఉన్నారని , వారితో ఎన్నికలకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమనే అభిప్రాయంతో ఉన్న జగన్, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టగల మంచి వాక్చాతుర్యం ఉన్న వారికి సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించాలని, వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.

 Cm Jagan Likely To Reshuffle His Cabinet Ministers Details, Jagan, Ap Cm Jagan,-TeluguStop.com

ఎప్పటి నుంచో దీనిపై సంకేతాలు వస్తున్న , ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు( MLC Elections ) తర్వాత  మంత్రివర్గ ప్రక్షాళన చేపడతారనే ప్రచారం జరిగింది.కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలలో కొంతమందికి మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు,  కీలక నాయకులతో జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలి, 

Telugu Ap, Ap Cm Jagan, Ap Ministers, Jagan, Kodali Nani, Perni Nani, Telugudesa

ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే విషయాలను చర్చించిన జగన్ ఈ సందర్భంగా మంత్రివర్గ ప్రక్షాళన పైన హింట్ ఇచ్చారట.ఈ సందర్భంగానే ప్రస్తుత మంత్రులలో కొంతమంది పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలకు మంత్రివర్గ ప్రక్షాళన పై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అన్ని కుదిరితే వచ్చేవారమే క్యాబినెట్ ప్రక్షాళన చేపట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట.దీంతో ఎవరెవరిపై వేటు పడబోతుంది ?  ఎవరికి అవకాశం ఉండకపోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu Ap, Ap Cm Jagan, Ap Ministers, Jagan, Kodali Nani, Perni Nani, Telugudesa

మంత్రివర్గ ప్రక్షాళన చేపడితే కచ్చితంగా వేటుపడే మంత్రులు వీరేనంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.వారిలో సిజరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా , చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ , గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్ వంటి వారిపై వేటు పడే అవకాశం ఉన్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది .ఇక కొత్త మంత్రి వర్గంలో మాజీ మంత్రులు కొడాలి నాని , పేర్ని నాని,  బాలినేని శ్రీనివాస్ రెడ్డి, గడికోట  శ్రీకాంత్ రెడ్డి తో పాటు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్ , మర్రి రాజశేఖర్,  తోట త్రిమూర్తులు వంటి వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube