జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో అసలు విషయం బట్టబయలైంది వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడు కేసు నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరింది జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడు బిజెపితో చేసుకున్న ఒప్పందంతో వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుంది పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదు
కేంద్రాన్ని నిలదీసి పోలవరం బాధితులను ఆదుకోవాలి రాష్ట్రాన్ని జగన్ స్మశానంలా మారుస్తున్నాడు లండన్ నుంచి నీరవ్ మోడీ స్టేట్ మెంట్ ఇవ్వడం హాస్యాస్పదం రాహుల్ గాంధీని లండన్ కోర్టుకు రప్పిస్తానని నీరవ్ మోడీ చెప్పడమేంటి.? మోడీకి ఆర్థిక నేరగాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ రాహుల్ గాంధీని మోడీ రాజకీయ హత్య చేశాడు ప్రజాకోర్టులో మోడీని దోషిగా నిలబెడతారు.ఘోరంగా ఓడిస్తారు బిజెపిపై రాజకీయ పరమైన ఉద్యమం అవసరం దేశ్ కా బచావో-మోడీ హఠావో అన్న నినాదంతో ఏప్రిల్ 14వతేదీ నుంచి మే 15వతేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం
.