సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు అలాగే హీరో హీరోయిన్ల పక్కన చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన వారు కొన్ని ఏళ్ల తర్వాత గుర్తుపట్టలేని విధంగా మారిపోతూ ఉంటారు.అటువంటి వారిలో మహేష్ బాబు( Mahesh Babu ) పక్కన నటించిన అమ్మాయి కూడా ఒకరు.
సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్( Venkatesh ) హీరోలుగా నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.
ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ సినిమాలో ఇక మూవీ మహేష్, వెంకీల కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పవచ్చు.ఇకపోతే ఈ సినిమాలో ట్రైన్ సీన్ దగ్గర మహేష్ ఓ అమ్మాయిని చూసి ఓ డైలాగ్ చెబుతాడు.అదేంటంటే? చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతీదీ అంటూ మహేష్ చెప్పిన ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే.ఇక ఈ సీన్ లో నటించిన అమ్మాయి గుర్తుందా? అప్పుడు పంజాబీ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎంత హాట్ గా మారిందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.ఆ అమ్మాయి పేరు సుప్రియా ఐసోలా.( supriya aysola ) తెలుగులో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించింది.
అవసరాల శ్రీనివాస్ నటించిన బాబు బాగా బిజీ అనే సినిమాలో బోల్డ్ గా నటించి అందరికి షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.సినిమా తరువాత సుప్రియాకు ఎక్కువగా అటువంటి పాత్రలే వచ్చాయి.ప్రస్తుతం సుప్రియ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇక తాజాగా వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో నటించింది.
ప్రస్తుతం సుప్రియ అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీగా ఉంది.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ మహేష్ బాబు సినిమాలో అంత పద్ధతిగా కనిపించిన ఈమె ప్రస్తుతం ఇంత హాట్ గా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.