వాట్సాప్ వాడేవారికి వాట్సాప్( Whatsapp ) బిజినెస్ అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది తమతమ వ్యాపారాలను వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారానే చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వినియోగదారుల సౌలభ్యం కొరకు వాట్సాప్ తన బిజినెస్ యాప్ ద్వారా వారు మరింత సక్సెస్ అయ్యేందుకు కొత్త కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది.ఇందులో భాగంగా తాజాగా వాట్సాప్ బూస్ట్ స్టేటస్( WhatsApp Boost Status ) పేరిట ఒక సరికొత్త షార్ట్‌కట్ తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఐఓయస్, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లకు ఈ ఫీచర్ రిలీజ్ అవుతున్నట్లు వాట్సాప్ ట్రాకర్ వాబీటాఇన్ఫో వెల్లడించింది.
ఈ షార్ట్‌కట్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమంటే, చాలా రోజులుగా అనేక వ్యాపారాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా తమ ప్రొడక్ట్స్ ప్రచారం చేస్తూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి.అయితే ఫేస్‌బుక్‌లో ఇంకా యాడ్స్ పోస్ట్ చేయడం ప్రారంభించని వ్యాపారాలను అటువైపు మళ్లించాలని వాట్సాప్ యోచిస్తోంది.అందుకే వాట్సాప్‌లో పెట్టే స్టేటస్‌ను ఈజీగా ఫేస్‌బుక్‌లో అడ్వర్టైజ్ చేయడానికి కొత్త షార్ట్‌కట్‌ను తీసుకొచ్చింది.
ఈ షార్ట్‌కట్ ద్వారా పోస్ట్ చేసే యాడ్స్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చన్నమాట.
ఈ నేపథ్యంలో వాట్సాప్ బీటా ఇన్ఫో బూస్ట్ స్టేటస్( Info Boost Status ) షార్ట్‌కట్‌కి సంబంధించి 2 స్క్రీన్‌షాట్స్ షేర్ చేయడం జరిగింది.ఆ స్క్రీన్‌షాట్స్ ప్రకారం, కొత్త షార్ట్‌కట్‌తో ఇప్పుడు బిజినెస్ యూజర్లు వాట్సాప్‌లో వారి స్టేటస్ అప్‌డేట్స్ నుంచి యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.స్టేటస్ అప్‌డేట్‌ను షేర్ చేసిన తర్వాత వాటిని ఫేస్‌బుక్ యాప్‌కి ఫార్వార్డ్ చేయడానికి కేవలం షార్ట్‌కట్‌పై క్లిక్ చేస్తే పని అయిపోతుంది.
తరువాత అక్కడ వారు ప్రకటనను ఎడిట్ చేయవచ్చు, డిస్క్రిప్షన్ రాయవచ్చన్నమాట.అదే విధంగా ఆ ప్రకటనను ఎంతకాలం రన్ కావాలో కూడా ఇక్కడ ఎంచుకోవచ్చు.ప్రస్తుతం బిజినెస్ యాప్‌లోని కొంతమంది బీటా టెస్టర్లు ఫేస్‌బుక్ యాప్‌కి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ప్రకటనలను సృష్టించడానికి ఎక్స్‌ట్రా షార్ట్‌కట్‌ను కూడా పొందవచ్చని వాబీటాఇన్ఫో వెల్లడించింది.