రామోజీరావు పాలిట నక్షత్రకుడిలా మారిన ఉండవల్లి

విశ్వామిత్రుని శిష్యుడైన నక్షత్రకుడు తన గురువుకి హరిచంద్రుడు బాకీ ఉన్న సొమ్ము వసూలు నియమించబడినవాడు.అందుకోసం హరిచంద్రుని వెంటపడిన వాడు.

 Undavalli Arun Kumar Ramoji Rao Margadarshi Chit Fund Case Details, Undavalli Ar-TeluguStop.com

రాజ్యం కోల్పోయి భార్యాబిడ్డలతో సహా రోడ్డు మీద పడిన కూడా చివరి నిమిషం వరకు అప్పు తీర్చమని వేధించినవాడు నక్షత్రకుడు.అందుకే ఎవరైనా వదలకుండా వెంటపడుతూ విసిగిస్తుంటే నా పాలిట నక్షత్రకుడు లా తయారయ్యావు అంటుంటారు… ఇప్పుడు బహుశా రామోజీరావు ( Ramojirao ) కూడా ఉండవల్లిని గూర్చి అలానే అనుకుంటూ ఉంటాడు.

ఎవరూ పట్టించుకోని ఒక కేసుని 15 సంవత్సరాల పాటు అలుపెరగకుండా కొనసాగించడం చిన్న విషయం కాదు అది కూడా తన వ్యక్తిగత ప్రయోజనం లేని కేసులో.మార్గదర్శిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ముందుగా బయటపెట్టిన వాడు ఉండవల్లి అరుణ్ కుమార్( Undavalli arun kumar ) మాత్రమే.

వెనక ఉందినడిపించిది రాజశేఖర్ రెడ్డి అని ఆరోపణలు ఉన్నా కూడా ముందు ఉంది పోరాటం చేసిన అరుణ్కుమార్ పాత్ర చిన్నదేమి కాదు.ఈ కేసు నిరూపించడానికి ఆయన అనేక సంవత్సరాలు పాటు ప్రయత్నించాడు .కేసులో కొంత పురోగతి సాధించిన కూడా తన వెనుక వెన్నుదన్నుగా నిలబడిన రాజ శేఖర రెడ్డి మరణం తో కేసు ముందుకు కదలలేదు .ప్రభుత్వ నుండి సరైన మద్దత్తు లేఖపోవడం తో ఆ కేసు ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు కొట్టి వేసింది.అంతటితో వదిలిపెట్టని ఉండవల్లి ఆ తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేశారు.తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఉండవల్లిది ఒంటరి పోరాటం అయింది.

Telugu Ap, Cmjagan, Ramoji Rao, Undavalli, Undavalliarun, Ysrajasekhar-Telugu Po

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో కూడా ఆ కేసును పట్టించుకోలేదు, అయితే ఇప్పుడు కేసు కీలక దశలో జగన్ ప్రభుత్వం(Jagan) ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేసింది.ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి బలం పది రెట్లు పెరిగినట్లు అయింది .ఆయన ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .మార్గదర్శి లో జరిగిన అవకతవక ల పై , అక్రమాలపై తనకు పూర్తిస్థాయి సమాచారం ఉందని ఆధారాలు కూడా ఉన్నాయని.

Telugu Ap, Cmjagan, Ramoji Rao, Undavalli, Undavalliarun, Ysrajasekhar-Telugu Po

చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం సేకరించిన సొమ్మును జాతీయ బ్యాంకులకు డిపాజిట్ చేయకుండా నష్టాల్లో ఉన్న తమ కంపెనీల్లో పెట్టుబడులు పేడుతున్నారని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని.ఇది ప్రజల సొమ్మును అపహరించే పరిణామం కాబట్టి దీనిపై కచ్చితంగా కోర్టు లో సవాలు చేసి విజయం సాధిస్తానని ఆయన తెలిపారు ప్రభుత్వం కూడా తన పోరాటానికి మద్దతు ఇవ్వడం సంతోషించదగిన విషయమని, ఇది పూర్తిగా సీరియస్ విషయం అయినందున ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాయాలని ఆయన ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వాన్ని కోరారు వ్యక్తిగత ప్రయోజనం లేకపోయినప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం ఈ స్థాయి ప్రయత్నం చేస్తున్నందుకు మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ కచ్చితంగా అభినందనీయుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube