జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది .తొందరలో కాలీ అవబోతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈనెల 29 తో పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్రెడ్డి మరియు నారా లోకేష్ ల యొక్క పదవీకాలం ముగియనుంది .ఎన్నికల కోసం అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే ప్రక్రియను కూడా పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల గెలుపు ఏకగ్రీవమే అని భావిస్తుంది.నిజానికి వైసిపి కున్న సంఖ్యాబలంతో చూస్తే ఈ గెలుపు లాంచనమే అని చెప్పాలి.అయితే చిన్న అవకాశం దొరికితే చిన్న గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడ గల రాజకీయ చాణిక్యం గల చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి జలక్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం .అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం ఆయన చంద్రబాబు ఎమ్మెల్సీ కోటా ఎన్నికలలో టిడిపి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఒక అభ్యర్థి గెలవడానికి 22 నుంచి 23 ఓట్లు అవసరమని టిడిపికి అధికారికంగా 23 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నప్పటికీ ఇందులో నలుగురు ఇప్పటికే వైసిపి క్యాంపులో చేరారు.అనధికారికంగా వైసిపి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పటికీ టెక్నికల్ గా వీరు ఇంకా టిడిపి ఎమ్మెల్యేల కింద లెక్క.తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా గోడదూకిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి , వారిని పార్టీ ధిక్కరణ నేరం కింద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా వారి ఎమ్మెల్యే స్థానానికి ఎసరు పెట్టబోతున్నట్లుగా టిడిపి వర్గాల సమాచారం.
ఒకవేళ వైసీపీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కలిసి వస్తే ఆ స్థానం గెలవడం కూడా అంత కష్టం కాదన్నట్లుగా టిడిపి లెక్కలేసుకుంటుంది మరి ఏ రకంగా చూసుకున్న ఎన్నికల్లో పోటీ చేయడం టిడిపికి అనుకూలంగానే ఉన్నట్టు ఉంది.మరి నిజంగానే పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టి విప్ జారీ చేస్తే పార్టీ మారిన వల్లభనేని వంశీ తదితరుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి
.