సినిమా ఇండస్ట్రీ లో ఎవరు శాశ్వతం గా ఉండరు ఇవాళ్ళ ఒకరు లైమ్ లైట్ లో ఉంటారు రేపు ఇంకొకరు ఉంటారు అంతే తప్ప ఎప్పటికీ ఒక్కరే ఉంటారు అని గ్యారంటీగా చెప్పలేము అయితే కొంత మందికి చాలా టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళు చేసిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవుతుంటాయి దానికి కారణాలు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు కొన్ని సార్లు అన్ని బాగున్న కూడా సక్సెస్ అయితే రాదు అలాంటి డైరెక్టర్స్ లో ఒకరు మెహర్ రమేష్ ఆయన చేసిన కంత్రి, బిల్లా సినిమాలు బాగుంటాయి స్టైలిష్ గా కూడా ఉంటాయి కానీ అవి రెండూ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి ఆయన చేసిన శక్తి, షాడో సినిమాలు స్టోరీ పరం గా డైరెక్షన్ పరం గా చాలా వీక్ గా ఉంటాయి ఇవి ప్లాప్ అవ్వడం లో న్యాయం ఉంది కానీ కంత్రి, బిల్లా మాత్రం ఒకే అనేలా ఉంటాయి అయిన కూడా ఈ సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఇక ఈ లిస్ట్ లో చెప్పుకునే ఇంకో డైరెక్టర్ జీవన్ రెడ్డి ఈయన చేసిన సినిమాలు అయిన దళం జార్జ్ రెడ్డి సినిమాలు చాలా బాగుంటాయి అయిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేక పోయాయి.జీవన్ రెడ్డి ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఆయన చేసిన సినిమాలని చూస్తే మనకు ఆ విషయం అర్థమై పోతుంది ఇక ఆకాష్ పూరి తో చేసిన చోర్ బజార్ సినిమా కూడా నిరాశ పరిచిందనే చెప్పాలి…
ఇక తరువాత చెప్పుకోబోయే డైరెక్టర్ సంతోష్ జగర్ల పూడి ఈయన తీసిన సుబ్రమణ్య పురం, లక్ష్య సినిమాలు పర్లేదు అనిపించినప్పటికీ అవి ప్లాప్ సినిమాలుగా మిగిలాయి అలా టాలెంట్ ఉండి కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ కోసం ఎదురుచూసే డైరెక్టర్స్ ఇంకా చాలామందే ఉన్నారు…