మోడీకి ప్రజా షాక్ తప్పదా !

దేశంలో 2014 నుంచి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్. ఎన్నో సంక్షేమాలు అమలు చేశామని, దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించామని గొప్పలు చెబుతున్నా సామాన్యుడికి మాత్రం తిప్పలు తప్పడం లేదు.

 Common People Are Against Narendra Modi Due To Increasing Prices Details, Bjp, C-TeluguStop.com

సామాన్యుడికి అవసరమయ్యే నిత్యవసర ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూ ప్రజాజేబు కు చిల్లు వేస్తోంది మోడీ సర్కార్.డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్. వంటి వాటితో పాటు ఇంకా సామాన్యుడికి అవసరమయ్యే నిత్యవసర సరుకుల ధరలను కూడా ఎప్పటికప్పుడు పెంచుతూ సామాన్యుడిపై ఆర్థిక భారాన్ని మోపుతోంది.2014 లో కంటే ముందు 60-70 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.120 దాటి ఇంకా పరుగులు పెడుతోంది.50-60 రూపాయలు ఉన్న డీజిల్ ఇప్పుడు 100 రూపాయలు దాటుతోంది.

Telugu Bjp, Common, Gas Cylinder, India, Modi-Politics

ఇక గ్యాస్ విషయానికొస్తే 2014 కంటే ముందు 410 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు 1000 రూపాయలు దాటి రూ.1300 .దిశగా దూసుకుపోతుంది.ఈ రేంజ్ లో ధరలు పెంచుతూ సామాన్యుడి జీవనాన్ని దుర్భర పరిస్థితికి తీసుకొస్తోందంటూ మోడీ సర్కార్ పై కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక తాజాగా మరోసారి గ్యాస్ ధర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో సామాన్య ప్రజలకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి నెలకొంది.గ్యాస్ పై ఉన్న సబ్సిడీ ఎత్తివేసిన తరువాత వంట గ్యాస్ ధర రూ.1000 లకు చేరింది.గత ఏడాది రూ.50 రూపాయలు పెంచడంతో 1000-1100 రూపాయలు పెట్టి వంట గ్యాస్ కొనల్సిన పరిస్థితి.ఇక తాజాగా మరో రూ.50 పెంచడంతో ఇప్పుడు వంట గ్యాస్ 1100-1200 రూపాయలకు చేరింది.

Telugu Bjp, Common, Gas Cylinder, India, Modi-Politics

దీని ధర ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.మరి ఈ స్థాయిలో సామాన్యుడిపై అర్హ్తిక భారం మోపుతున్న మోడీ సర్కార్ పోనీ దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తుందా అంటే ఆ ప్రశ్నలకు కూడా సమాధానం లేదు.ప్రపంచ ఆరోగ్య సూచికలో భారత్ 2014 లో 85 వ స్థానంలో ఉంటే 2022 నాటికి 146 వ స్థానానికి పడిపోయింది.

హ్యూమన్ ఫ్రీడం ఇండెక్స్ లో 2014 లో 106 వ స్థానంలో ఉన్న భారత్ 2022 నాటికి 150 కి దిగజారింది.ఇంక పర్యావరణ సూచికలో 2014 లో 155 స్థానంలో ఉండగా 2022 నాటికి 180 కి చేరింది.

ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మీద వరల్డ్ డెవలప్మెంట్ ఇండెక్స్ లలో భారత్ స్థానం 2014 తో పోలిస్తే చాలానే పడిపోయింది.మరి అభివృద్ది ఎక్కడ జరిగిందనేది కొందరి రాజకీయ వాదుల ప్రశ్న.

మొత్తానికి అటు ఆర్థికంగాను పేదలపై భారం.ఇటు అభివృద్ది పరంగానూ దేశంలో శూన్యం అని మోడీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోడీకి షాక్ ఇవ్వడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube