అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా ఈ సంవత్సరం చివర్లోనే పుష్ప సినిమా వస్తుందని భావిస్తున్నారు.
కానీ నిన్న మొన్నటి వరకు వచ్చే సంవత్సరం సంక్రాంతి కి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.కానీ మైత్రి మూవీ మేకర్స్ వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కాకుండా సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సమ్మర్ లో పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసే అవకాశం ఉంది.అంతే కాకుండా మార్చి చివరి వారంలోనే సినిమా ను విడుదల చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.ఇప్పటికే సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్.పుష్ప 2 సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా కంటిన్యూ అవుతుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించేందుకుగాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేవి శ్రీ ప్రసాద్ మరో సారి ప్రపంచ వ్యాప్తంగా అలరించే సంగీతాన్ని ఈ సినిమా కోసం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా పుష్ప 2 సినిమా రాబోతుంది.ఉత్తర భారతం లో పుష్ప 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టగా ఈ సినిమా అంతకు మించి రాబట్టబోతుందని నమ్మకాన్ని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమంత చేసిన ఐటం సాంగ్ కు మంచి స్పందన వచ్చింది.
కనుక మరో సారి ఐటం సాంగ్ పై దృష్టి పెట్టడం జరిగిందట.అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది.