15 ఏళ్లకే ముస్లిం బాలికలు పెళ్లి చేసుకోవచ్చా.. సుప్రీంకోర్టు ఏం చెప్పింది...

భారతదేశంలో పెళ్లి చేసుకోవాలంటే బాలికలకు 18 ఏళ్లు వయసు ఉండాలి.అయినప్పటికీ, ముస్లిం బాలికలకు వారు యుక్తవయస్సుకి చ్చినప్పుడు లేదా 15 సంవత్సరాలు కనీస వివాహ వయస్సుగా ఉంటుంది.

 Can Muslim Girls Get Married At The Age Of 15 What Did The Supreme Court Say ,su-TeluguStop.com

ముస్లింల వ్యక్తిగత చట్టం (పర్సనల్ లా) ప్రకారం ఇదే వారి కనీస పెళ్లి వయసు.అయితే ముస్లిం అమ్మాయిలు 15 ఏళ్ల వయస్సుకే తమ ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తుందా, లేదా అనేది చర్చనీయాంశం అయ్యింది.

ఎందుకంటే 15 ఏళ్లకే ముస్లిం బాలికలు పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమా కాదా అన్న విషయంపై ఒక పిటిషన్ ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు అయింది.

యుక్తవయస్సు వచ్చిన తర్వాత ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.15 ఏళ్ల వయసున్న ముస్లిం యువతి వ్యక్తిగత చట్టం ప్రకారం చట్టబద్ధమైన, చెల్లుబాటయ్యే వివాహాన్ని చేసుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును మరే ఇతర కేసులోనూ ఆధారం చేసుకోరాదని, తీర్పును ఒక ప్రామాణికంగా తీసుకోరాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

లైంగిక సమ్మతికి 18 సంవత్సరాల వయసును ఉండాలన్న పోక్సో చట్టానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి ఎగైనెస్ట్ గా ఉన్నట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) పిటిషన్ దాఖలు చేయగా దానిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube