మాజీమంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పేర్ని నానివి అనాలోచిత వ్యాఖ్యలని చెప్పారు.
కాపులకు రిజర్వేషన్లు కావాలంటే పార్లమెంట్ కి వెళ్లాలా అని ప్రశ్నించారు.రెండు పార్టీలు కాపులను నమ్మించి మోసం చేశాయని ఆరోపించారు.
ముస్లింలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సోమువీర్రాజు స్పష్టం చేశారు.