చాలా మంది ప్రజలకు కొన్ని రకాల పండ్లను చూడగానే నోరూరిపోయి దాన్ని తినకుండా ఉండలేకపోతుంటారు.ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పండు అంటే ఇష్టం ఉంటుంది.
కొందరిలో అనాసపండ్లు చూడగానే నోరూరి తినాలనిపిస్తూ ఉంటుంది.ఎందుకంటే ఈ పండు అద్భుతమైన రుచిని కలిగి ఉండడంతో పాటు మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తూ ఉంటుంది.
అనసపండ్లను పైనాపిల్ అని కూడా చెబుతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పైనాపిల్ లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, సోడియం, ఐరన్, విటమిన్ ఏ లాంటి ఎన్నో రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
అనాస పండ్లలో సమృద్ధిగా లభించే విటమిన్ సి సహజ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర జీవక్రియను క్రమబద్ధీకరించి తక్షణ శక్తిని అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి.ఇంకా చెప్పాలంటే అనేక రకాల ఇన్ఫెక్షన్లను ఎదుర్కొని రోగనిరోధక శక్తిని మన శరీరంలో పెంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
అనాసపండ్లలో పొటాషియం, మాంగనీస్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఎన్నో ఉన్నాయి.ఈ లవణాలు మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేసి మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి.
అంతే కాకుండా ఇవి కండరాలు ఎముకల దృఢత్వానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.కీళ్ల నొప్పులు, కండరాల వాపు వంటి సమస్యల నుంచి ఇవి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ త్రాగడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు పొట్ట, నడుము, రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ నిల్వను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
పైనాపిల్ రసంలో తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం త్రాగడం వల్ల సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఇంటర్మీడియట్రీ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడి పచ్చకామెర్లు, ఫ్యాటీ లివర్, క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.పనసపండు ముక్కలను తేనెలో ఒక రోజంతా ఉంచి మరుసరి రోజు తింటే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అయిపోతాయి.అంతే కాకుండా పైనాపిల్ గుజ్జును అప్పుడప్పుడు చర్మంపై మర్దన చేసుకుంటూ ఉండటం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.