సాధారణంగా చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటుంటారు.వీరు ప్రొఫెషనల్స్ వలె డ్యాన్స్ చేయడం చాలా అరుదు.
ఇలాంటి టాలెంట్ ఉన్న వారు టీవీ షోలలో మాత్రమే వీరు కనిపిస్తారు.అయితే తాజాగా ఒక పాప రైల్వే స్టేషన్ దగ్గర అద్భుతమైన స్టెప్పులు వేసి అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచింది.
ఆ పాప డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.
నిజానికి ఆ పాప చాలామందికి తెలిసిందే.
రీసెంట్‌గా ఈ చిన్నారి “డ్యాన్స్ ఇండియా డ్యాన్స్” అనే రియాల్టీ టీవీ షోలో పాటిస్పేట్ చేసింది.ఈ టాలెంటెడ్ డ్యాన్సర్ పేరు ఆధ్యాశ్రీ ఉపాధ్యాయ.
టీవీలో మాత్రమే కాకుండా 7 ఖూన్ మాఫ్ సినిమాలోని డార్లింగ్ పాటకు కూడా డ్యాన్స్ చేసి వెండితెరకు కూడా పరిచయం అయింది.వయసు చిన్నదే అయినా డ్యాన్స్ లో ఎన్నో మెలుకువలు నేర్చుకున్న ఈ పాప గ్రేస్ ఫుల్ గా స్టెప్పులు వేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.
అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంది.ఆ పాపకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

కాగా తన ఫాలోవర్ల కోసం ఈ చిట్టి తల్లి ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తుంటుంది.తాజాగా రైల్వే స్టేషన్‌లో తన డాన్స్ కి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ఈ వీడియో వైరల్ గా మారింది.దీనికి ఇప్పటికే మూడు లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి.31,000 లైకులు వచ్చాయి.ఈ వీడియో చూసిన చాలామంది చిన్నారిని బాగా పొగుడుతున్నారు సూపర్ గా డ్యాన్స్ చేసావమ్మా అని కితాబిస్తున్నారు.మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.







